బాలయ్య కూడా దేవుడిగా..?

సోషియో ఫాంటసీ సినిమాల్లో దేవుడిగా నటించడం అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తారు. గతంలో గోపాల గోపాల సినిమాలో ఆయన మఫ్టీలో వున్న దేవుడిగా కనిపించారు.  Advertisement త్వరలో చేయబోయే పీపుల్స్ మీడియా సినిమాలో…

సోషియో ఫాంటసీ సినిమాల్లో దేవుడిగా నటించడం అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తారు. గతంలో గోపాల గోపాల సినిమాలో ఆయన మఫ్టీలో వున్న దేవుడిగా కనిపించారు. 

త్వరలో చేయబోయే పీపుల్స్ మీడియా సినిమాలో కూడా ఆయన మఫ్టీలో వున్న దేవుడిగా కనిపించబోతున్నారు. అయితే ఇలాంటి పాత్రలకు మిగిలిన హీరోల సంగతి ఎలా వున్నా బాలకృష్ణ మాత్రం దూరంగా వుంటారు.

చేస్తే పౌరాణిక సినిమాలు చేసి దేవుడిగా నటిస్తారేమో కానీ సోషల్ మూవీల్లో మఫ్టీల్లో వున్న దేవుడిగా నటించడం ఆయన ఇంత వరకు చేయలేదు. ఇప్పుడు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఓ రీమేక్ సినిమా కోసం ఆయనను దేవుడి పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఇంకా ఎస్..ఆర్ నో చెప్పలేదని, త్వరలో ఏ విషయం తెలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. నిజానికి ఇదే పాత్ర కోసం హీరో వెంకటేష్ ను సంప్రదించారని కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరు చేస్తారో దేవుడిగా?