ఉత్తరాదిన సూపర్ హిట్టయింది ఛావా సినిమా. విక్కీ కౌశల్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేయమంటూ సోషల్ మీడియాలో డిమాండ్స్ వెల్లువెత్తాయి. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
ఛావా సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతోంది. ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది ఛావా సినిమా. సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్ నటించాడు. అతడి నటనకు ఉత్తరాది ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. ఇక శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించింది. కీలకమైన ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించాడు.
ఫిబ్రవరి 14న రిలీజైన ఛావా సినిమా ఇప్పటికే 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్టవుతుందని అంచనా వేస్తున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, సున్నా,, ఒకటి, తొమ్మిది, నాలుగు,