అల్లు అర్జున్ సన్నిహితుడు, అల్లు అరవింద్ లెఫ్ట్..రైట్ హ్యాండ్, నిర్మాత బన్నీవాస్. జనసేన కు కూడా కీలకం. ఎన్నికల ముందు జనసేన ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ తన పనులు తాను చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బన్నీవాస్ ను పవన్ పక్కన పెట్టేసారనే మాటలు వినిపించాయి. కానీ ప్రచార కమిటీకి ఇప్పుడు పనేం వుంటుంది. ఎన్నికల టైమ్ లోనే కదా. మొత్తం మీద అంతా సైలంట్ గా వుండడంతో బన్నీవాస్ కు ఇక రాజకీయంగా పెద్ద పని ఏమీ లేదనుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ బన్నీవాస్ భుజంపై బోలెడు బాధ్యతలు పెట్టారు పవన్ కళ్యాణ్. త్వరలో పిఠాపురంలో జరిగే జనసేన సభల బాధ్యతలు బన్నీవాస్ కు అప్పగించారు. ముఖ్యంగా సభల ప్రచార కార్యక్రమంతో పాటు, స్టేజ్ ఏర్పాటు, నిర్వహణ ఇవన్నీ బన్నీవాస్ కు అప్పగించారు. అంటే బన్నీవాస్-పవన్ బంధాల మీద ఇప్పటి వరకు వినిపించినవి అన్నీ గాసిప్స్ మాత్రమే అని తేలిపోయింది.
బన్నీవాస్ 2029లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వున్నాయి. నిడదవోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వుంది. 2024లోనే అక్కడి నుంచి పోటీ చేయాల్సి వుంది. లాస్ట్ మినిట్ లో కందుల దుర్గేష్ ను రాజమండ్రి నుంచి అక్కడకు మార్చడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,