టాక్సిక్.. ఇంగ్లీష్ లో కూడా..!

గత ఏడాది ఆగస్ట్ లో ప్రారంభమైన ఈ సినిమా కంటెంట్, మేకింగ్ అంతా యూనివర్సల్ అప్పీల్ తో వుండడంతో, హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

కేజిఎఫ్ హీరో యష్ లేటెస్ట్ సినిమా టాక్సిక్. కెవిఎన్ సంస్థ భారీగా నిర్మిస్తున్న సినిమా. ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం కన్నడ..తెలుగు, మలయాళ, హిందీ తదితర భారతీయ భాషల్లో మాత్రమే అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో కూడా తీస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్ లో ప్రారంభమైన ఈ సినిమా కంటెంట్, మేకింగ్ అంతా యూనివర్సల్ అప్పీల్ తో వుండడంతో, హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో మేకర్లు ఇంగ్లీష్ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారు. ఎ ఫెయిరీ టైల్ ఆఫ్ గ్రోన్ అప్స్ అన్నది టాక్సిక్ టైటిల్ కు ట్యాగ్ లైన్.

హాలీవుడ్ స్టంట్ కొరియాగ్రాఫర్, ‘జాన్ విక్’ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జెజె పెర్రీ ఈ టాక్సిక్ సినిమాకు పని చేస్తున్నారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కోసం ‘డ్యూన్: పార్ట్ 2’ లకు పని చేసిన డిఎన్ఎమ్జీ స్టూడియో పని చేస్తోంది.

హిందీ వెర్షన్ విడుదల చేయాలని డిసైడ్ అయిన సందర్భంగా టాక్సిక్ డైరక్టర్ గీతూ మోహందాస్ మాట్లాడుతూ – “‘టాక్సిక్’ కోసం ఒక అంతర్జాతీయ స్థాయి కథను రాసుకున్నాం. ఇది కేవలం మనదేశ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విదేశీ ప్రేక్షకులకు కూడా చేరాలనే ఆలోచనతో ఇంగ్లీష్ వెర్షన్ ను రెడీ చేస్తున్నాం అన్నారు. కల్చరల్ బ్యారియర్స్ ను దాటి ఇది అందరు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అన్నారు.

టాక్సిక్ నిర్మాత నిర్మాత వెంకట్ నారాయణ మాట్లాడుతూ – “టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టులునే చిత్రంగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. ‘టాక్సిక్’ తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది, అలాగే భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది” అన్నారు. హీరో యష్ తన ‘మాస్టర్ మైండ్ క్రియేషన్స్ ‘ బ్యానర్ మీద కెవిఎన్ సంస్థ వెంకటనారాయణతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

2 Replies to “టాక్సిక్.. ఇంగ్లీష్ లో కూడా..!”

Comments are closed.