ఏపీలో బీజేపీ బీసీల కోసం చూస్తోంది. వారిని అక్కున చేర్చుకునే పనిలో ఉంది. కాపు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే బీసీలను కూడా కలుపుకుని పోవాలని చూస్తోంది. ఉత్తరాంధ్రాలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. దాంతో అక్కడ నుంచి బీసీలకు కీలక పదవులు ఇచ్చేందుకు బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
విశాఖ జిల్లాకు చెందిన పీవీఎన్ మాధవ్‌కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆరేళ్ళ పాటు ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పీవీఎన్ మాధవ్‌కి ఏపీలో ఖాళీ అయిన అయిదు ఎమ్మెల్సీ పోస్టులలో ఒకటి దక్కవచ్చు అన్నది ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అయిదు పదవులు ఖాళీ అయ్యాయి. ఇందులో విశాఖ నుంచి టీడీపీకి చెందిన బీసీ నేత దువ్వారపు రామారావు పదవీ కాలం ముగిసి రిటైర్ అవుతున్నారు. ఈ పోస్టు కోసం విశాఖ నుంచే మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని ఒక పక్క టీడీపీ నుంచి గట్టిగా ఒత్తిడి ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కక చాలా మంది త్యాగరాజులైన తమ్ముళ్ళు ఈ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.
అయితే కూటమిలో పార్టీగా ఉన్న బీజేపీకి ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయం అని అంటున్నారు. ఆ ఒక్క పోస్ట్ కోసం గోదావరి జిల్లాలకు చెందిన నేతలు, రాయలసీమకు చెందిన బీజేపీ సీనియర్లు పోటీలో ఉన్నారని అంటున్నారు. అయితే బీజేపీ పెద్దలు ఉత్తరాంధ్రకు, బీసీలకు ఈ పదవి ఇవ్వాలని ఆలోచిస్తోందని అంటున్నారు.
మాధవ్‌కి ఈ పదవి ఇస్తే, ఆయన తన గళాన్ని బలంగా పెద్దల సభలో వినిపించడమే కాకుండా, ఫ్యూచర్‌లో బీజేపీకి మరింత బలమైన నేతగా నిలుస్తారు అని భావిస్తున్నారు. దాంతో, తమ్ముళ్ళ ఆశలకు పీవీ మాధవ్ రూపంలో ఎసరు వస్తోందని అంటున్నారు.
He is velama caste ( all upper castes are BCs in uttarandhra except for brahmins vysya and kapus rajus in vizag area are bc’s. .. reddies velamas toorpu kapus velamas are all bcs in that regiojln) this was done to motivate them t to join united andhra …u sud mention that also right..
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
వీడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు
మరి ఎవరు ఉంటుంది అనుకుంటున్నావ్
నేను లేక నాలాంటి నిజాయతి పరులు