ప్రశాంత్ వర్మ టైమ్ ఎప్పుడొస్తుందో?

ప్రభాస్ తో సినిమా ఓకే చేయించుకోవడం గొప్ప కాదు. అతడి కాల్షీట్లు పట్టుకోవడం పెద్ద విషయంగా మారిందిప్పుడు.

ప్రభాస్ తో సినిమా ఓకే చేయించుకోవడం గొప్ప కాదు. అతడి కాల్షీట్లు పట్టుకోవడం పెద్ద విషయంగా మారిందిప్పుడు. అప్పుడెప్పుడో ఏడాదిన్నర కిందట ఓకే చేసిన స్పిరిట్ సినిమానే ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు లిస్ట్ లోకి ప్రశాంత్ వర్మ వచ్చి చేరాడు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడు. హోంబలే సంస్థ నిర్మిస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. మైథలాజికల్-యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతోంది.

అంతా బాగానే ఉంది కానీ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. రేపోమాపో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

ఇవి కాకుండా పైప్ లైన్లో కల్కి-2, సలార్-2 సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు ప్రభాస్. కనీసం ఒక ఏడాదైనా ప్రశాంత్ వర్మ వెయిట్ చేయాల్సి ఉంటుంది.

One Reply to “ప్రశాంత్ వర్మ టైమ్ ఎప్పుడొస్తుందో?”

Comments are closed.