హరిహర వీరమల్లు సినిమా విడుదలకు దగ్గరపడుతున్న కొద్దీ హీరోయిన్ నిధి అగర్వాల్ మరింత యాక్టివ్ అవుతోంది. ఈ రోజుల కోసమే ఆమె ఇన్నాళ్లూ వెయిట్ చేసింది.
మొన్ననే ఈ సినిమా నుంచి రెండో సింగిల్ రిలీజైంది. అందులో నిధి అగర్వాల్ ఉంది. అలా ఈ సినిమా నుంచి ఆమె దృశ్యాలు కొన్ని తొలిసారి బయటకొచ్చాయి. ఈ సందర్భంగా మరోసారి ఆ సినిమా విశేషాలు, పవన్ తో గడిపిన క్షణాల్ని గుర్తుచేసుకుంది నిధి అగర్వాల్.
ఇప్పటికే సినిమాకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ వెల్లడించిన ఈ బ్యూటీ, తాజాగా పవన్ తో వర్క్ షాప్ విశేషాలు వెల్లడించింది. సినిమా మేకింగ్ లో భాగంగా పవన్ తో వర్క్ షాపు నిర్వహించిందంట నిధి అగర్వాల్.
పవన్ కల్యాణ్, తను కలిసి డైలాగ్స్ పై చాలా చర్చించుకున్నామని, రిహార్సల్స్ కూడా చేశానని, ఇలా చేయడం వల్ల షూటింగ్ లో సమయం ఆదా అయిందని అంటోంది. స్క్రిప్ట్ నుంచి ప్రతి అంశాన్ని పవన్ దగ్గరుండి చూసుకున్నారని చెబుతోంది నిధి.
పవన్ కల్యాణ్ కెరీర్ లోనే తొలి చారిత్రక నేపథ్యం ఉన్న మూవీగా వస్తోంది హరిహర వీరమల్లు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు ముందుగా కొబ్బరికాయ కొట్టాడు. కొంత షూటింగ్ తర్వాత అతడు తప్పుకొని, జ్యోతికృష్ణకు బాధ్యతలు అప్పగించాడు. మధ్యలో సినిమాను 2 భాగాలుగా చేశారు.
అలా మూడేళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది.
WoW!!!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు