ఇద్ద‌రు పొలిటిక‌ల్ హీరోలు.. ఎంతో తేడా!

ప‌వ‌న్ మాట‌ల్లో ప్ర‌త్యామ్నాయం, మార్పులాంటి ప‌దాలు త‌ప్ప‌, చేత‌ల్లో అందుకు పూర్తి భిన్న‌త్వం క‌నిపిస్తుంద‌ని సొంత పార్టీ నాయ‌కులు నిట్టూర్చుతున్నారు.

త‌మిళంలో విజ‌య్ అగ్ర‌హీరో. తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌స్టార్‌. విజ‌య్‌తో పోల్చితే, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొన్నేళ్లు ముందుగానే రాజ‌కీయాల్లో అడుగు పెట్టారు. కానీ స్ఫూర్తి నింప‌డంలో మాత్రం త‌మిళ హీరో విజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌మిళ‌నాడు మార్పు తీసుకొచ్చేందుకు త‌మిళ‌గ వెట్రి క‌ళిగం అనే రాజ‌కీయ పార్టీని కొంత కాలం క్రితం ప్రారంభించారు. వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

అధికార‌మే ల‌క్ష్యంగా విజ‌య్ రాజ‌కీయ పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌హాబ‌లిపురంలో పార్టీ మ‌హాస‌భ‌లో విజ‌య్ ప్ర‌సంగిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెజార్టీ స్థానాల్లో విజ‌యం సాధించి త‌మిళ రాజ‌కీయాల్లో చ‌రిత్ర తిర‌గ‌రాస్తాన‌న్నారు. త‌న పార్టీ ఎప్పుడైనా సామాన్యుల‌కే రాజ్యాధికారం క‌ల్పిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. డీఎంకే పాల‌న‌లో అవినీతి, అక్ర‌మాలు జ‌రుగుతున్నా కేంద్ర ప్ర‌భుత్వం చోద్యం చేస్తోంద‌ని దుయ్య‌బట్టారు. డీఎంకే, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయ‌ని విరుచుకుప‌డ్డారు.

ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తీసుకుంటే 2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పార్టీని అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని బీరాలు ప‌లికిన ప‌వ‌న్‌…టీడీపీ-బీజేపీ అవినీతి పాల‌న‌పై నోరు మెద‌ప‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, చివ‌రికి తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావ‌డం, కేంద్రంలో మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి రావ‌డంతో ప‌వ‌న్ వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నిక‌ల్లో కూట‌మి ఏర్ప‌డ‌డానికి తాను బీజేపీ పెద్ద‌ల‌తో తిట్లు తినాల్ని వ‌చ్చింద‌ని బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ రాజ‌కీయ పంథా ఇట్లుంటే, మ‌న పొరుగునే త‌మిళ‌నాడు రాష్ట్రంలో సినీ హీరో విజ‌య్ రాజ‌కీయ పార్టీని స్థాపించి అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీని సైతం ఏకిపారేస్తున్నారు. ప‌వ‌న్ మాత్రం చెప్పేదొక‌టి, చేసేదొక‌టి అనే చందంగా త‌యారైందన్న విమ‌ర్శ బ‌లంగా వుంది. విజ‌య్ రాజ‌కీయ ఉప‌న్యాసాల్లో ఆత్మాభిమానం ప‌రిమ‌ళిస్తోంది. కానీ ప‌వ‌న్ ప్ర‌సంగాల్లో బానిస‌త మ‌న‌స్త‌త్వం క‌నిపిస్తోంద‌ని సొంత పార్టీ శ్రేణులే విమ‌ర్శిస్తున్నాయి.

ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిన్న అసెంబ్లీలో మ‌రో 15 ఏళ్లు చంద్ర‌బాబుతోనే క‌లిసి ఉంటాన‌న్న కామెంట్స్‌ను జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు గుర్తు చేస్తున్నారు. నిజంగా రాజ‌కీయాల్లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలంటే, విజ‌య్‌లా విజ‌య‌మో, వీర‌స్వ‌ర్గ‌మో అని త‌ల‌ప‌డాల‌నే స్ఫూర్తిదాయ‌క అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ప‌వ‌న్ మాట‌ల్లో ప్ర‌త్యామ్నాయం, మార్పులాంటి ప‌దాలు త‌ప్ప‌, చేత‌ల్లో అందుకు పూర్తి భిన్న‌త్వం క‌నిపిస్తుంద‌ని సొంత పార్టీ నాయ‌కులు నిట్టూర్చుతున్నారు.

61 Replies to “ఇద్ద‌రు పొలిటిక‌ల్ హీరోలు.. ఎంతో తేడా!”

  1. నీ ఎడుపు పవన్ CM అవ్వాలని కాదు! పవన్ చంద్రబాబు తొ కలిసె ఉంటె ఇంక జగన్ రాజకీయలు మరిచిపొవాల్సిందె అని నీ ఎడుపు!

  2. Eppudu kuda evado okadi meeda padi edavadame kani, basic sence, ikkadi paristhithilu, ee rashtra lrayojanalu, ikkadi prajala kashtalu evi neeku akkarledu. Enthasepu jaggadi muddi nakadam kosam evevo rendu pichhi koothalu kusesthavu

  3. విజయ్ కి పవన్ కి నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా వుంది.

    విజయ్ ఒంటరి గా పోరాడగలడు అలాగే ఏదో ఒక రోజు సింగల్ గా సీఎం కాగలడు.

    1. కమల్ హస్సన్, విజయకాంత్, రజినీకాంత్ అంత అంతే అనుకున్నారు….చివరికి ఏమైంది

    2. కమల్ హస్సన్, విజయకాంత్, రజినీకాంత్ అంత అంతే అనుకున్నారు….చివరికి ఏమైంది

    1. పాబ్లొ ఎస్కొబార్ ని చూడు అక్కడె ఉండి పొయాడు… అదె జగన్ ని అయితె మా గొర్రెలు ఎకంగా ముక్యమంత్రిని చెసాయి!

  4. ఒక అయినా అధికార పార్టీ ని ఓడిస్తా అంటున్నాడు .. ఇంకో అయినా అధికార పార్టీ ని ఇంటికి పంపిచేసాడు ఆల్రెడీ .. అదే తేడా ..

  5. గ్యాస్ ఆంధ్ర eno వేసుకోర తమిళనాడులో విజయ్ గాడికి అంత సీన్ లేదు ఎలక్షన్ తరువాత విజయ్ గాడి పార్టి పరిస్థితి చూడు

  6. విజయమో వీర స్వర్గమో అనడానికి ఇదేం యుద్ధం కాదు రా హౌలే. రాజకీయం. తమిళనాడు లాగా ఇక్కడ ప్రతిపక్ష శూన్యం లేదు. ఏకపక్ష పార్టీ ఆధిపత్యం ఉంది. AP లో రెండు దిగ్గజ పార్టీలు ఉన్నాయి. ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా రాస్తారు రా ఆర్టికల్స్. నువ్వేం జర్నలిస్టు. ఛ.

  7. పవన్ కళ్యాణ్ గారు…నిజంగా ఓ గొప్ప రాజకీయవేత్త.. అతను పరిణితి చెందుతున్న ఓ రాజకీయ మేధావి. తొందరపడి బొక్క బోర్లా పడి.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకోవడం లేదు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది. ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నాయకుడు.

  8. అరె ఎంకట్ రెడ్డి గా నీ ఈ కవిత్వం లో నీ నాయకుడి కళ్లల్లో ఆనందం కోసం నువ్వు కట్టుకున్న బానిస సంకెళ్ళ మాకు కనబడుతున్నాయి నువ్వు ఎంత లేపిన మీ నాయకుడు లేవలేడు ఐదు సంవత్సరాల అధికారంలో ఎంత మంది సైకోలను తయారు చేసాడో నిన్ను నీ వార్తలను చూస్తే తెలిసిపోతుంది ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తారు వాళ్ళని వీళ్ళని చూపించి

  9. Orey GAy, 2026 TN elections [lo odina] tharvatha kooda mee hero (vijay) ilage unte appudu alochiddam. Ayina political decisions anevi state lo unde circumstances ni batti untayi. Aa state lo koolchivethala, reverse tender la CM ledu ga mari. Ade jalagnna stallin ni choosi nerchukovali kada amma/ anna canteen lu mootakoodadani. So velli ee suddulevo mee 11reddy ki cheppoko

  10. ఈ గ్రేట్ ఆంధ్ర కి …

    ఏకాడికి పవన్ కళ్యాణ్ న్ని ఎక్కడ ఎలా తొక్కాలా అని చూడటమే పని …

    అరేయ్ఒ క్కటీ చెప్తా చూడు …

    పవన్ కళ్యాణ్ కూడ పార్టీ పెట్టినప్పుడు విజయ్ కంటే పది రేట్లు ఆవేశం గా ఆలోచన గా మాట్లాడడు …

    ఇక్కడ పరిస్థితి ని బట్టి తన తగ్గి నెగ్గదు …

    అసలు స్కూల్ కి కూడ పోనీ వాడిని

    10 th చదివే వాడితో పోల్చితే ఎలా ఉంటుంటో …

    నువ్వు విజయ్ పవన్ గురించి పోల్చి మాట్లాడుతుంటే అలాగే ఉంది …

    నువ్వు నీ చెత్త న్యూస్ …

      1. అంటే ఈ గొల్టి బాంద్రా గాడు ఆడికి వత్తాసు పలుకుతున్న మీరూ ఒకే కులమా. విమర్శా ప్రతివిమర్శలకు కూడా కులాన్ని అద్దుతున్న తెలుగోళ్లు ఇక ఎప్పటికి బాగుపడతారో.

  11. Orey GA Jjako, pakka state lo TRS chudu entha baga opposition role play chesthondho, kani ekkada mee anna prathipaksha hoda kosam na na sankalu ….maku kuda comparisons vachhu neenu okkadike kadhu….Venkat Reddy ante aa TV debat la lo barre gothuekukoni arusthuntave adhi nuvvena??

  12. పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని బాగానే ఏకి పారేస్తున్నారు కదా! జయ లలిత గారి మరణం తరువాత అక్కడ ఒకవిధంగా రాజకీయ శూన్యత ఉంది. దానిని ఆయన అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    ఇక్కడ రాజకీయ శూన్యత లేదు. మీరు భజన చేసే వైసీపీ నీ పూర్తిగా పడుకొబెట్టేసిన తరువాత ఆయన కూడా మీరు కోరుకున్న విధంగానే ప్రవర్తిస్తారు లెండి.

  13. Meeru cheppina Vijay chese rajakeeyam eppudo jamana kalam. Ippati rajakeeyalu veru. Ye yenda ki aa godugu pattadame neti rajakeeyam. Ayina vijay inka elections lo contest cheyaledu. PK present Govt lo partner. Modi daggara entho parapathi undhi. State development ki Modi cooperation chala avasaram. Daniki taggatte ippatiki PK rajakeeyam chestunnadu. Emo future lo TDP ki BJP ki eduru nilustademo.

  14. Era15 years kalasi unta anaru kani kalisi poti chestham analedhu oka vela kalisi poti chesina thakuva seats ki chestham analedhu notiki vachindhi vagakudadhu nuvu jagan banisa ani thelusu . Rastam kosam kalisi untam anaru 2019 lo bjp ni vimarsinchaledhe thapudu rathlu rayaku nana great andhra

  15. నీ సోది ఆపు రా నాయనా నువ్వు ఎంత నెగటివ్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏమిటో అందరికీ తెలుసు నీ ప్లాన్ ఏంటి పవన్ కూటమి నుండి విడిపోతే ycp గెలుపు ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకో next కూడా కూటమి నే గెలుస్తుంది 😍

    1. Just check his speech at the Maha Bhakti inauguration event, he already mentioned that he wouldn’t be available in Maharashtra due to a personal event. If he had been invited, he might have attended. It is Isha who invites selective guests every Shivaratri.

    2. Just check his speech at the Maha Bhakti inauguration event, he already mentioned that he wouldn’t be available for Mahashivratri due to a personal event. If he had been invited, he might have attended. It is Isha who invites selective guests every Shivaratri.

    3. Just check his speech at the Maha Bhakti inauguration event, he already mentioned that he wouldn’t be available for Mahashivratri due to a personal event. If he had been invited, he might have attended. It is Isha who invites selective guests every Shivaratri.

    4. Isha decides the guests for every Shivaratri. It’s simple, if Pawan had been invited to this year’s event, he would have attended. However, during the inauguration of a channel, he clearly stated that he wouldn’t be available for Shivaratri due to a personal commitment.

  16. కొద్దీ రోజులు ఆగరదే అప్పట్లో విజయకాంత్ బెటర్ చిరంజీవి కంటే అన్నారు తర్వాత ఆయన నిలబడిన ఒక్క సీటు కూడా గెలవలేదు… ఆల్రెడీ అన్నా డీఎంకే తో విజయ్ పార్టీ చర్చలు జరుగుతోంది కూటమి కట్టడానికి ప్రశాంత్ కిషోర్ మధ్య వర్తి గా.. అప్పటి వరకు ఈ పోస్ట్ అలానే పెట్టుకో.. అందరూ జగన్ పార్టీ లాగా అంటరాని పార్టీ లు కాదు

  17. అసలు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని రోజులైంది. అప్పుడే GA లో ఎంతో స్ఫూర్తిని నింపేసాడు అంట☺️☺️. తెల్లారితే ఎవరో ఒకరితో పోల్చి పవన్ కళ్యాణ్ కేరక్టర్ నీ తక్కువ చేసి చూపాలి. తీసుకుంటున్న కూలీ కి ఈ GA గారు న్యాయం చెయ్యాలి🤣🤣. ఇలాంటి వార్తలు రాస్తే నమ్మితే మీ Paytm బ్యాచ్ నమ్మాలి తప్ప ఇంకెవరూ నమ్మరు🤣🤣.

    1. స్ఫూర్తి నింపుతున్నాడు అన్నాడు…

      స్ఫూర్తి నింపడానికి 10ఏళ్లు పడుతుందా???సరే

      నీ జ్ఞానం తోనే చెప్పు

      పవన్ ఏమి స్ఫూర్తి నీకు ఇచ్చాడు

      1. 10 years ayina kuda gelichadu kada, ade spoorthi…

        Ekkada maa anna ki antha capacity unte ok cinema theeyamanu Jalsa records baddalu avuthundi emo Chuddam

        Oka different field lo undi gelavadam veru, puttinappati nunchi Andulo undi andulone gelavatam veru.

  18. Great Andhra జర్నలిజానికే మాయని మచ్చ…ఎన్ని కధలు, కల్పనలు వండి వారుస్తుందో…!

    నమ్మేవారు ఉంటే ఇప్పటికి అంతర్జాతీయంగా

    ఏ స్థాయిలో ఉండేదో?

  19. సరే అంతా బానే రాసుకోవచ్చావ్ 2024 లో యూ టర్న్ తీసుకున్నారు అన్నావు కానీ యూటర్న్ తీసుకున్న తర్వాత గెలిచాడు తన పోటీ చేసే స్థానాల్లో 22 స్థానాల్లో గెలిచాడు అని ఎందుకు రాయలేకపోయావ్. ఎందుకంటే నీ నర నరాల్లో కళ్యాణ్ మీద వ్యతిరేకత వైసీపీ మీద విపరీతమైన ప్రేమ పొంగుతుంది కాబట్టి. ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు తెలీదు గానీ కనీసం ఒక్కసారైనా న్యూట్రల్ గా న్యూస్ రాస్తే చూసి సంతోషిద్దామని కోరిక

Comments are closed.