పార్టీ కాదు… సామాజికవర్గమే ముఖ్యమట!

తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి.

కాంగ్రెసు పార్టీని ఖాతరు చేయని ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న మరోసారి పార్టీని ధిక్కరించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్​ మల్లన్న కాంగ్రెసు అభ్యర్థికి కాకుండా బహుజన సమాజ్​ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ప్రచారం చేస్తున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి.

చాలాకాలం నుంచి పార్టీని ధిక్కరిస్తున్న తీన్మార్​ మల్లన్న మరోసారి పార్టీని కేర్​ చేయలేదు. దీనికి కారణం అడిగితే…తనకు పార్టీ కంటే తన సామాజికవర్గమే ప్రధానమని చెప్పాడు. ఒకవైపు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్​ వినిపిస్తోంది. కాని మల్లన్న మాత్రం మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాడు.

కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. తీన్మార్​ మల్లన్న అధికారిక అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉంది. అంటే పార్టీలో ఉంటే ఉంటాను…పోతే పోతాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. తీన్మార్ మల్లన్న తన సొంత పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ పరిణామాలు ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. కాని ఆయన పట్టించుకోలేదు. కాని కాంగ్రెసు పార్టీ చర్యలు తీసుకుంటే మాత్రం ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టీటీడీపీ) తన రాజకీయ పునరుద్ధరణ కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి బీసీ వర్గాలపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా.. ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు.

ఇప్పుడు అదే తరహాలో బీసీ నేత తీన్మార్ మల్లన్నను తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది.

బీసీ వర్గాల్లో టీడీపీకి కొంతమేర సానుభూతి ఉండటం, అదే అదనుగా తీసుకుని మల్లన్నకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవ్వాలనే ఆలోచన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేదా కొత్త పార్టీ స్థాపిస్తారా? లేక టీడీపీలో చేరి భవిష్యత్తు రాజకీయ ప్రయాణం సాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు, పరపతి, బలం ఉంది. తీన్మార్ మల్లన్న ఓకే అంటే మాత్రం తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం అవుతుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి.

5 Replies to “పార్టీ కాదు… సామాజికవర్గమే ముఖ్యమట!”

  1. ఆంధ్ర పార్టీ లకు.. తెలంగాణాలో.. స్థానం లేదు అని… ఇప్పటికే.. అర్ధం అయిపోయింది. టీడీపీ లో చేరితే.. రాజకీయసన్యాసం తీసుకున్నట్టే!

    షర్మిలకు.. ఎందుకు ఆదరణ రాలేదు అంటే.. కారణం ఆంధ్ర మూలాలే! టీడీపీ కి సానుభూతిపరులు తప్ప… గెలిచేంత సత్తా లేదు!

    టీడీపీ తెలంగాణలో..గెలవాలంటే.. ఆంధ్రాలో.. ఏమైనా.. అభివృద్ధి ఉరకలేస్తోందా? దావోస్ కెళ్ళి ఒట్టి చేతులతో వచ్చాడు!

    జగన్ గాడు పంచి అప్పులు చేసాడు… బొల్లి గాడు.. ఒక్క పైసా.. ప్రజలకు.. ఏ పథకం ద్వారా.. ఇవ్వకుండానే.. 120000 కొట్లా అప్పు చేసేసాడు.. అంటే… రోజుకి.. 500 కోట్లలెక్కన!

    ఎక్కడ ఖర్చుపెట్టాడో.. అసలు ఎప్పుడు తెచ్చుకున్న్నాడో.. ఎంత వడ్డీకి తెచ్చాడో.. ఏం చెప్పకుండా.. గుట్టు చప్పుడు కాకుండా.. భోంచేస్తున్నాడు.

    మరి.. ఇటువంటి బొల్లి గాడి పార్టీ ని పక్క రాష్ట్రము వాళ్ళు ఎలా నమ్మి ఓట్లేస్తారు?

    రాజకీయం సమాధి కావాలంటే.. తీన్మార్ గాడు.. టీడీపీని ఎంచుకుంటాడు!

Comments are closed.