శింగనమల.. సుద్దపూసేం కాదు

శింగనమల చరిత్ర కావాలంటే పొద్దుటూరు ఫైనాన్సియర్లను అడిగితే తెలుస్తుంది

శింగనమల రమేష్. నిన్నటికి నిన్న వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. “ఖలేజా”, “కొమరంపులి” సినిమాల కారణంగా వంద కోట్లు నష్టపోయాను అని చెప్పారు. దీనిపై కొంత మంది పొద్దుటూరు ఫైనాన్సియర్లు మండి పడుతున్నారు. ఆఫ్ ది రికార్డుగా గ్రేట్ ఆంధ్రతో మాట్లాడుతూ, “శింగనమల చరిత్ర కావాలంటే పొద్దుటూరు ఫైనాన్సియర్లను అడిగితే తెలుస్తుంది” అన్నారు. వంద కోట్లు నష్టపోయాను అన్నది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.

“ఈ రోజుల్లో సినిమాల మీద వంద కోట్లు నష్టం అంటే నమ్మవచ్చేమో, కానీ ఆ రోజుల్లో అంత మొత్తాలు ఎక్కడ?” అని ప్రశ్నించారు.

ఆ సంగతి అలా ఉంచితే, శింగనమల రమేష్ పొద్దుటూరు ఫైనాన్సియర్లకు డబ్బులు ఎగ్గొట్టారని, వంద రూపాయలు ఇవ్వాల్సిన వాళ్లకు 60 రూపాయల వంతున ఇచ్చారని తెలిపారు. అది కూడా తామంతా కిందా మీదా పడి, పొలిటీషియన్లను సంప్రదించి, సి. కళ్యాణ్ తో పంచాయతీలు చేసి తెచ్చుకున్నామని వివరించారు.

శింగనమల రమేష్ సినిమాల నిర్మాణం ఎందుకు లేట్ అయిందో, అప్పటి యూనిట్‌ను అడిగితే తెలుస్తుందని అన్నారు. తన సన్నిహితుడు, ఫ్యాక్షనిస్ట్ సూరి ని తీసుకుని వచ్చి సెట్లో కూర్చోపెడితే, ఏ హీరో వచ్చి పని చేస్తారని ప్రశ్నించారు.

“ఈసారి శింగనమలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మమ్మల్ని కూడా అడిగితే, మొత్తం ఇన్‌సైడ్ వ్యవహారాలు అన్నీ పూసగుచ్చినట్లు చెబుతాం” అన్నారు.

11 Replies to “శింగనమల.. సుద్దపూసేం కాదు”

  1. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  2. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nud cal

Comments are closed.