టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల‌పై విజిలెన్స్ త‌ప్పుదోవ‌?

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఒక మాట ప్రముఖంగా చెప్తుంటారు. వంద మంది దోషులు త‌ప్పించుకున్నా, ఒక్క నిర‌ప‌రాధికి శిక్ష ప‌డ‌కూడ‌దనేది న్యాయప‌ర‌మైన నైతిక‌త‌.

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఒక మాట ప్రముఖంగా చెప్తుంటారు. వంద మంది దోషులు త‌ప్పించుకున్నా, ఒక్క నిర‌ప‌రాధికి శిక్ష ప‌డ‌కూడ‌దనేది న్యాయప‌ర‌మైన నైతిక‌త‌. టీటీడీ అంటే హిందువులు త‌మ‌కు సంబంధించిన అత్యంత ప్రాధాన్యం క‌లిగిన ఆధ్యాత్మిక సంస్థ‌గా భావిస్తారు. హిందూ మ‌త ప్ర‌చారం కోసం టీటీడీ కృషి అమూల్యం.

హిందువులు ప‌ర‌మ ప‌విత్రంగా భావించే టీటీడీలో అన్య‌మ‌త‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో జీవో కూడా తీసుకొచ్చారు. ఇది స్వాగ‌తించాల్సిందే. అయితే తాజాగా టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు పేరుతో 18 మంది అన్య‌మ‌త‌స్తులంటూ ఒక జాబితా విడుద‌లైంది. అయితే ఇందులో నిఖార్సైన హిందువుల్ని కూడా అన్య‌మ‌త‌స్తుల జాబితాలో చేర్చ‌డం నివ్వెర‌ప‌రుస్తోంది. వీలైతే ఇత‌ర మ‌త‌స్తుల్ని త‌మ మ‌తంలో చేర్చుకునేలా టీటీడీ వ్య‌వ‌హ‌రించాలి.

కానీ పుట్టుక‌తోనే హిందువులై, ఇప్పుడు కూడా ఆ గొప్ప మ‌త ఆచారాల్ని, సంప్ర‌దాయాల్ని పాటిస్తున్న ఉద్యోగుల్ని కూడా …అన్య‌మ‌త‌స్తుల‌న‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఈ విష‌యంలో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రిల‌ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది త‌ప్పుదారి ప‌ట్టించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఏ మాత్రం స‌రైంది కాద‌ని ప‌లువురు హిందూ పెద్ద‌లు కూడా అంటున్నారు.

ఈ జాబితాలో పేర్కొన్న వాళ్లంద‌రూ అన్య‌మ‌తస్తులే అని టీటీడీ బోర్డు స‌భ్యుడు, స్థానిక బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి ఆత్మ‌సాక్షిగా చెప్ప‌గ‌ల‌రా? విజిలెన్స్‌పై న‌మ్మ‌కంతో టీడీపీ పాల‌క మండ‌లి, ఉన్న‌తాధికారులు అన్య‌మ‌తస్తుల గుర్తింపు బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, వ్య‌క్తిగ‌త కోప‌తాపాల‌కు నిజ‌మైన హిందువుల్ని బ‌లిపెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌రైంది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

అన్య‌మ‌త‌స్తులను టీటీడీ నుంచి ప్ర‌భుత్వంలోకి పంపి, ఉద్యోగ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌నేది అంద‌రి అభిప్రాయం. కానీ అన్య‌మ‌త‌స్తుల గుర్తింపు సాకుతో విజిలెన్స్ త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న వైనాన్ని బీఆర్ నాయుడు, శ్యామ‌ల‌రావు, వెంక‌య్య చౌద‌రి గుర్తించాల్సిన కీల‌క స‌మ‌యం ఇది. ఎందుకంటే, సీఎం చంద్ర‌బాబుతో అన్య‌మ‌త‌స్తుల‌తో చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్తున్న త‌రుణంలో, వాస్త‌వాల్ని మాత్ర‌మే ప్ర‌భుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్లాలి. అందుకే త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న వాళ్ల విష‌యంలో బీఆర్ నాయుడు, టీటీడీ ఉన్న‌తాధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాల‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

11 Replies to “టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల‌పై విజిలెన్స్ త‌ప్పుదోవ‌?”

  1. అన్య మతస్తులు వాళ్ళ మతపరమైన హీన సంస్కృతి ఇక్కడ స్వేచ్చగా చూపెట్టడానికి అవకాశం ఉన్నట్టుంది,ఎందుకంటే మనది సెక్యులరిజ్మ్ మాటున ఉన్న వాళ్ళకి వోటు రూపం లో అవకాశమిచ్చి దేబిరిస్తుంటాం కదా.., మన ప్రభుత్వ వ్యవస్తల్లొ పాతుకు పోయినట్టున్నారు… ఉన్నారు…మోదీనె మరి కొన్ని టర్మ్ లు ఉంటే వీటిని సరిచేయడంకష్టమే కాని అసాధ్యం మట్టుకు కాదు… అలా కాక ఆంధ్రాకి నామం పెట్టి పాగాకోసం వేస్తున్న ఎత్తులే అయితే అంధ్రా వాళ్ళని ఆ వెంకన్నే ఆదుకోవాలి..

Comments are closed.