సీఎం ర‌మేశ్ అరాచ‌కాల్ని ఆది అడ్డుకుంటున్నందుకేనా?

రానున్న రోజుల్లో సీఎం ర‌మేశ్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య విభేదాలు మ‌రింత ముదిరే అవ‌కాశాలున్నాయి.

అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడు, జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య ఆధిప‌త్యం పోరు ప‌తాక స్థాయికి చేరింది. ఇద్ద‌రూ బీజేపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు ఒకే జిల్లా, ఒకే నియోజ‌క వ‌ర్గం కావ‌డం గ‌మనార్హం. వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని పోట్ల‌దుర్తి సీఎం ర‌మేశ్ స్వ‌గ్రామం.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం ర‌మేశ్ కంపెనీ చేప‌ట్టిన ప‌నుల్ని ఆదినారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు అడ్డుకోవ‌డం, ఉద్యోగుల్ని కొట్ట‌డాన్ని ఎంపీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 2న జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆ మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు దేవ‌గుడి నాగేశ్వ‌ర‌రెడ్డి నేతృత్వంలో రిప‌బ్లిక్ క్ల‌బ్‌లో అన‌ధికార‌, అసాంఘిక కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నార‌ని క‌డ‌ప క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌కు సీఎం సీఎం ర‌మేశ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో త‌న కార్యాల‌యానికి స‌మాచారం ఇవ్వాల‌ని కూడా ఆ లేఖ‌లో ప్ర‌త్యేకంగా కోరారు.

ఈ ఫిర్యాదుతో స‌ద‌రు క్ల‌బ్‌పై పోలీసులు దాడి చేశారు. అయితే ర‌మేశ్ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించే ఆధారాలేవీ ల‌భించ‌లేద‌ని స‌మాచారం. సీఎం ర‌మేశ్ త‌న అనుచ‌రుడిపై ఫిర్యాదు చేయ‌డంపై ఆదినారాయ‌ణ‌రెడ్డి తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. అయితే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న నాగేశ్వ‌ర‌రెడ్డి …మీడియాతో మాట్లాడుతూ సీఎం ర‌మేశ్‌పై సంచ‌లన విష‌యాలు చెప్పారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం ర‌మేశ్ అరాచ‌కాలకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ర‌మేశ్ అరాచ‌కాల‌ను ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి అడ్డుకోవ‌డం వ‌ల్లే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం ర‌మేశ్ పేరుతో ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ, ఆ స్క్రిప్ట్ అంతా వైసీపీ నాయ‌కుల‌దే అని ఆయ‌న అన్నారు.

రానున్న రోజుల్లో సీఎం ర‌మేశ్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య విభేదాలు మ‌రింత ముదిరే అవ‌కాశాలున్నాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగులో సీఎం ర‌మేశ్ కంపెనీ ప‌నుల్ని స‌జావుగా సాగే ప‌రిస్థితి వుండ‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్ద‌రు ముఖ్య నేత‌ల మ‌ధ్య వార్‌… క‌డ‌ప జిల్లాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

2 Replies to “సీఎం ర‌మేశ్ అరాచ‌కాల్ని ఆది అడ్డుకుంటున్నందుకేనా?”

Comments are closed.