స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే.. ఉద్యోగుల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌!

స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయంగా త‌మ వ‌ర్గంలో వ్య‌తిరేక‌త తెచ్చుకున్నార‌ని, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌పై త‌మ‌కేమీ కోపం లేద‌ని ఉద్యోగులు అంటున్నారు.

స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయంగా త‌మ వ‌ర్గంలో వ్య‌తిరేక‌త తెచ్చుకున్నార‌ని, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌పై త‌మ‌కేమీ కోపం లేద‌ని ఉద్యోగులు అంటున్నారు. ప్ర‌స్తుతం త‌మ ప‌రిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు అయ్యింద‌ని ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం.

ఎక్కువ ఆశ‌, అంచ‌నా వుండి, నెర‌వేర‌న‌ప్పుడు చాలా త్వ‌ర‌గా వ్య‌తిరేక‌త భావ‌న ఏర్ప‌డుతుంది. కూట‌మిపై ఉద్యోగుల్లో అప్పుడే స‌ణుగుడు మొద‌లైంది. ఏరికోరి తెచ్చుకున్న కూట‌మి పాల‌న‌లో త‌మ బ‌తుకులు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంద‌న్న చర్చ ఉద్యోగుల్లో మొద‌లైంది. ఏ న‌లుగురు ఉద్యోగులు క‌లిసినా, త‌మ‌కు రావాల్సిన వాటిపై కూట‌మి ఇంత వ‌ర‌కూ ఎలాంటి ముంద‌డుగు వేయ‌లేద‌ని, అలాగే ప్ర‌తినెలా ఒక‌టో తేదీనే వేత‌నాలు అంద‌జేత‌… కేవ‌లం మూణ్ణాళ్ల ముచ్చ‌టే అని విమ‌ర్శిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఉద్యోగుల‌కు ఏమీ చేయ‌ర‌ని, పైగా ర‌క‌ర‌కాలుగా వేధిస్తార‌ని తెలిసినా, వైసీపీ ప్ర‌భుత్వ తీరుతో హ‌ర్ట్ అయ్యామ‌ని ఉద్యోగులు నాడు చేప్పేవారు. ప్ర‌తిసారీ స‌జ్జ‌లు, రాగుల‌తో మాట్లాడాల‌ని ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌ చెప్పేవార‌ని, ఎన్నుకున్న‌ది ఆయ‌న్నైతే, త‌మ బాధ్య‌త‌ల్ని స‌ల‌హాదారుల‌కు అప్ప‌గించ‌డం ఏంట‌ని ఉద్యోగులు బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. నేడు కూడా జ‌గ‌న్ గురించి అదే మాట అంటున్నారు. త‌మ‌తో నేరుగా జ‌గ‌న్ చ‌ర్చించాల‌ని కోరుకున్నామ‌ని, ఆర్థిక ప‌రిస్థితి గురించి ఆయ‌నే చెప్పి వుంటే అర్థం చేసుకునేవాళ్ల‌మంటున్నారు.

అలా కాకుండా స‌ల‌హాదారుల‌కు, సంబంధం లేని మంత్రుల‌కు ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చించే బాధ్య‌త‌ల్ని అప్ప‌గించి, ఉద్యోగుల ఆగ్ర‌హానికి గుర‌య్యార‌న్న‌ది వాస్త‌వం. వైసీపీని ఇంటికి సాగ‌నంపాల‌ని పంతం ప‌ట్టి, ఎన్నిక‌ల్లో వ్య‌తిరేకంగా ఓట్లు వేశారు. ఇప్పుడు అదే ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఉద్యోగ సంఘాల నాయ‌కులు వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పంద‌న రాలేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇది ఆరంభం మాత్ర‌మే. ఎందుకంటే, ఉద్యోగుల ఆర్థిక స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వ ఖ‌జానాలో నిధులు లేవ‌ని పాల‌కులు అంటున్నారు. అందుకే ఉద్యోగుల ఆర్థికేత‌ర స‌మ‌స్య‌ల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుని, మిగిలిన వాటి గురించి పాల‌కులు మాట్లాడ్డం లేదు.

కానీ ఉద్యోగులేమీ సామాన్య ప్ర‌జానీకం మాదిరి ఆలోచించే ర‌కం కాదు. ప్ర‌భుత్వ ఆర్థిక ఇబ్బందుల‌తో త‌మ‌కేం సంబంధం అని ప్ర‌శ్నిస్తారు. ఉద్యోగుల్లో ఇంత త్వ‌ర‌గా అసంతృప్తి ఎందుకు మొద‌లైందంటే.. కూట‌మిపై ఎక్కువ ఆశ పెట్టుకోవ‌డం వ‌ల్లే. భ‌విష్య‌త్‌లో ఉద్యోగులు ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

18 Replies to “స‌జ్జ‌లు, రాగుల్ని న‌మ్ముకునే.. ఉద్యోగుల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌!”

  1. paatha bakayilu jagan hayaam lo unnavi 30 vela kotla payimate avanni theerchadam chandra babu valla nijanga avuthundhaa ??? mella gaa anni appulu theerchaali

  2. ఈ విషయం లో cbn నే సరైన వాడు….ఈ సారి ఆలశ్యం చేయడు,అలుసు ఇవ్వడు… కోసి కారం పెడతాడు సమయం చూసి అంటే పీకి పారేస్తాడు…

  3. “ఆర్థిక పరిస్థితి గురించి ఆయనే చెప్పుంటే అర్థం చేసుకునేవాళ్లం” j a g a n నీ అర్థం చేసుకుంటారు చంద్రబాబు ను మాత్రం అర్థం చేసుకోరంటావు.

  4. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  5. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది , bld cal

  6. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని జగ్గడూ చెబితే అర్థం చేసుకుంటారా? బాబు చెబితే చేసుకోరా… ఇదేం లాజిక్

Comments are closed.