జీవించి ఉండగా ఆయన ఎన్నడూ తెరమీద కనిపించాలని ముచ్చటపడిన వ్యక్తి కాదు. మీడియా వ్యాపారం వెర్రి తలలు వేయడానికి ముందే అనేక టీవీచానెళ్లు, సినిమాల ప్రొడక్షన్ హౌస్, దేశంలో అతిపెద్ద ఫిలింసిటీ ఇవన్నీ సొంతంగా కలిగి ఉన్నప్పటికీ.. ఆయన ఎన్నడూ.. తన వ్యాపారాలను తాను సొంతంగా ఎండార్స్ చేయాలని అనుకోలేదు. అలాంటి పనుల జోలికి వెళ్లలేదు.
వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించినప్పటికీ.. ఆయన ఎన్నడూ తాను ఎండార్స్ చేసి ఆ వ్యాపారాలను సాగించాలని చూడలేదు. అప్రకటితంగా తనమీద ఉండే నమ్మకమే.. ఆ వ్యాపారాలకు పునాది కావాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన మరణానంతరం.. రామోజీరావును.. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారానికి ఒక కార్పొరేట్ మోడల్ లాగా వాడుతున్నారు. ‘‘రామోజీ అంటే మార్గదర్శి.. రామోజీ అంటే నమ్మకం’’ అన్నట్టుగా ప్రచారం చేస్తూ.. రామోజీరావు బొమ్మను టీవీ ప్రకటనలకు వాడుకుంటున్నారు.
రామోజీరావు ప్రచార కాంక్ష ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఎన్నడూ తన ప్రచారాన్ని కోరుకోలేదు. ఎవరైనా తన సినిమాలకు ఇప్పుడు రామోజీరావు విజువల్స్ ను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ప్రకటనల్లో కొంత గ్రాఫిక్స్ తో మిక్స్ చేసి వాడుకుంటున్నారు. అలా వాడుకోవడం వారి ఇష్టం కానీ.. ఈటీవీ చూస్తున్నప్పుడు.. రామోజీరావు విజువల్స్ తో మార్గదర్శి ప్రకటన వచ్చిన తర్వాత.. దాని వెంటనే.. లలితా జ్యువెలరీ కిరణ్ కుమార్ ప్రకటన వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో రామోజీరావును, లలితా జ్యువెలరీ కిరణ్ కుమార్ తో సమానంగా మార్చేశారే అనిపిస్తుంది.
రామోజీరావు పట్ల భక్తిని ఆయన గ్రూపు సంస్థలు ప్రకటించుకోవడం తప్పు కాదు. కానీ మార్గదర్శికి మాత్రమే ఎందుకు ప్రకటనల్లో వాడుతున్నారు. రామోజీరావు మా స్ఫూర్తిప్రదాత అని ప్రకటించుకుంటే తప్ప మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పదిలంగా ఉండదని వారు భయపడుతున్నారా? లేదా, రామోజీరావు బొమ్మ కస్టమర్లను ఆకర్షిస్తుందని నమ్ముతున్నారా? చివరికి ఆయనను మరణానంతరం మోడలింగ్ కు వాడుతున్నారా? అని కొందరికి బాధ కలుగుతుంది.
రామోజీరావు పట్ల గ్రూపు వారి వారసుల్లో నిజంగా భక్తి ప్రపత్తులు ఉంటే గనుక.. చక్కగా ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో లోగో పక్కన ఆయన ఫోటోను వాడుకోవచ్చు. అది ఆయనకు గౌరవప్రదంగా ఉంటుంది. ఏ రకంగా అయితే సాక్షి పత్రిక వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల తన భక్తిని ప్రకటించుకుంటూ ఉంటుందో అదే రీతిగా.. ఈనాడు కూడా రామోజీరావు బొమ్మను వాడవచ్చు. అది ఆయనకు గౌరవప్రదంగా ఉంటుంది. ఈనాడులో వాడుతూ.. మార్గదర్శి ప్రకటనల్లో కూడా వాడుకుంటే పెద్దగా ఎవరికీ బాధ కూడా ఉండదు.
కానీ, మార్గదర్శి చిట్ ఫండ్ ప్రకటనల్లో రామోజీరావును వాడుతూ.. ఈనాడు పత్రిక మీద ప్రతి నిత్యం ఆయన బొమ్మ లేకపోతే.. ఆయనను ‘మార్గదర్శి రామోజీరావు’ ప్రజలు గుర్తుంచుకుంటే చాలునని వారసులు కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ.. ఆయన నిజానికి ‘ఈనాడు రామోజీరావు’గా గుర్తింపు పొందవలసిన వ్యక్తి. ఆ తేడాను గుర్తిస్తే బాగుంటుంది.
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, vc
ఎంటొ మన గాడి బాధా ఎడుపు! వాళ్ళు ఎమి వెసుకుంటారొ వాళ్ళ ఇష్టం!
.
ఇన్ని కష్టాలు పెట్టినా, రామొజి గారు అణా పైసలతొ సహా ప్రతి పైసా చెల్లిచారు. అలానె మెము కూడా నిబద్దతతొ ఉంటాము అన్నది వారి అబిప్రాయం కావచ్చు!
.
నువ్వు మాత్రం అర్జెంట్ గా జగన్ పొటొ వెసుకొ!
As per RBI guidelines Rule 69H, fixed deposits was not accepted of Margadarsi? But Mr. Ramoji obtained Rs.2,600/- Crores of FDs. How it is possible? It is possible for CBN……………..
నీకు ‘గుద్దలో మండుతున్నట్టు ఉంది. కానీ ఎందుకు??
How jagan got that much
Play boy work vundi :- nine, nine, eight, nine, zero, six, four, two, five, five
Well said
…