“నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే ప్యాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని, ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసు అని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయ పోరాటం గెలిచింది,” అన్నారు నిర్మాత శింగనమల రమేష్ బాబు.
‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలను నిర్మించిన ఆయన, ఓ కేసు కారణంగా 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ను నిర్దోషిగా తేల్చి, కేసును కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
“నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే ప్యాషన్‌తో నిర్మాతగా మారాను. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్, రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కొనసాగుతాను.
అప్పట్లో సినిమాలు ఆరు నెలలలోగా లేదా సంవత్సరంలో పూర్తయ్యేవి. కానీ నా దురదృష్టం కొద్దీ, నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలకు దాదాపు రూ.100 కోట్లు నష్టపోయాను.
14 కోట్లు మోసం చేశానని నాపై అభియోగం. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని, ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మానని కేసు పెట్టారు. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి,” అంటూ ముగించారు శింగనమల రమేష్.
How many articles you will write for same topic and description…
Play boy work vundi :- seven, nine, nine, seven, five, three, one, zero, zero, four
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, vc