హీరో నాని హీరోగా మాత్రమే కాదు, నిర్మాత గా కూడా ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. డిఫరెంట్ కథలను తెర మీదకు తీసుకురావలని ట్రయ్ చేస్తూ వస్తున్నారు. అలా లేటెస్ట్ గా నిర్మించిన సినిమా కోర్ట్. స్టామినా వున్న పలువురు నటులను తీసుకుని, ఒక టీనేజ్ జంటను కీలకంగా ముందు వుంచి చేసిన సినిమా ఇది. 14న విడుదలయ్యే ఈ సినిమా ట్రయిలర్ ఈ రోజు విడుదలయింది. టైటిల్ లోనే వుంది ఇది కోర్టు చుట్టూ తిరిగే కథ అని. ఇప్పటికే కోర్టు చుట్టూ తిరిగే కథలు మనకు చాలా వచ్చాయి. తమిళంలో వచ్చిన జైభీమ్, తెలుగులో రీమేక్ అయిన వకీల్ సాబ్ ఇలా చాలా వున్నాయి.
కోర్టు సినిమా ట్రయిలర్ ఇంటెన్సివ్ గా వుంది కానీ, కొత్తగా లేదు. వేసిన ప్రతి సీన్ ఎప్పుడో ఒకసారి చూసినట్లే వుంది తప్ప కొత్తగా అనిపించలేదు. ఓ ప్రేమ జంట. అమ్మాయి తండ్రి మోతుబరి..అబ్బాయి పేదింటివాడు. కేసు బనాయించారు. అడ్డమైన సెక్షన్లు పెట్టారు. లాయర్లు చేతులెత్తేసారు. నెలల కొద్దీ జైలు, చేయని తప్పు ఒప్పుకోమంటూ హింస పెట్టడం, అందరూ చేతుల ఎత్తేసిన వేళ ఒక చిన్న లాయర్ కేసు టేకప్ చేయడం.
ఇదీ ట్రయిలర్ లో కనిపించింది. ఇక్కడి వరకు రొటీన్ ప్లస్ గతంలో చాలా సార్లు చూసినట్లు అనిపించే సీన్లే. కానీ దీని తరువాత ఏమిటి అన్నది అసలు సినిమా. అది కొత్తగా వుండొచ్చు. ఆసక్తికరంగా వుండొచ్చు. ఎలా వుంటుంది అన్నది సినిమా వస్తే కానీ తెలియదు.
ఇదిలా వుంటే సినిమాలో మంచి నటులను తీసుకున్నారు. ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, ఇలా చాలా అంటే చాలా మంది సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు వున్నారు. ట్రయిలర్ ను కమర్షియల్ గా కట్ చేయాలని అనుకోలేదు. ఎలా తీసాము.. ఏం తీసాము అన్నది క్లారిటీ గా ముందే చెప్పాలని డిసైడ్ అయి కట్ చేసినట్లు కనిపిస్తోంది.ఈ సినిమాకు దర్శకుడు రామ్ జగదీష్.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Super vundi