మీరు చదివింది నిజమే. చదరపు గజం లేక సెంటు జాగా రేటు కాదిది. కేవలం ఒక చదరపు అడుగు రేటు అక్షరాలా లక్ష రూపాయలు. ముంబయిలో ఈ రికార్డ్ నమోదైంది.
ముంబయిలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఉన్న అవలాన్ టవర్ లో ఫ్లాట్ నంబర్ 701 అమ్మకం జరిగింది. సహస్త్ర అడ్వైజర్స్ అనే ప్రైవేట్ కంపెనీ ఈ ఫ్లాట్ ను 106 కోట్ల రూపాయలకు కొనుగులు చేసింది.
ఫ్లాట్ మొత్తం ఏరియా 9863 చదరపు అడుగులు. బిల్టప్ ఏరియా దాదాపు 8963 అడుగులు. దీని ఆధారంగా చూసుకుంటే, ఈ లావాదేవీలో చదరపు అడుగు ధర లక్షా 8వేల రూపాయలు పడింది. అలా ముంబయిలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా ఇది నిలిచింది. వి-హోటల్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ప్రాపర్టీని అమ్మింది.
ముంబయిలో లగ్జరీ అపార్ట్ మెంట్లు, ఖరీదైన క్రయవిక్రయాలకు జుహూ అడ్డాగా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఏరియాను ఎక్కువగా ఇష్టపడ్డమే దీనికి కారణం. ప్రస్తుతం నగరంలో అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో అదిప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Omd