ట్రయిలర్ విడదులవుతూనే యూ ట్యూబ్ లో వైరల్ అయిపోవడంతో రవితేజ 'క్రాక్' మీద అంచనాలు పెరిగాయి.
పండగకు సరైన మాస్ సినిమా అనే టాక్ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో క్రాక్ డిజిటల్ రైట్స్ కు కాస్త డిమాండ్ పెరిగినట్లు బోగట్టా.
ఓన్లీ తెలుగు ఓటిటి ఆహా తొలిసారి ఓ పెద్ద సినిమా కొనడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏడున్నర కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు బోగట్టా.
అల్లు అరవింద్ కు నిర్మాత టాగూర్ మధుకు వున్న సాన్నిహిత్యంతో ఈ డీల్ డిస్కషన్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే డిజిటల్ హక్కుల రీత్యా పది కోట్లు రావాలని నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ తో కూడా బేరాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రేంజ్ లో ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు బోగట్టా.