తన బర్త్ డే సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని ముందస్తుగా అన్ని ఏర్పాట్లనూ చేసుకుంది నటి దీపికా పదుకోన్. ముప్పై ఆరవ ఏట అడుగుపెడుతున్న ఈ బాలీవుడ్ నటీమణి ఈ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామనుకుందట. ముంబైలో తనకు కావాల్సిన వారందరిని పిలచుకుని బర్త్ డే ను భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుందామనుకుందట. అయితే ఏం చేద్దాం.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో, రిస్క్ తీసుకోకుండా.. తన బర్త్ డే వేడుకలను దీపిక రద్దు చేసుకుంది.
బాలీవుడ్ సెలబ్రిటీలు బాగా మెరిసేది పార్టీల్లోనే. తమ సహచరుల బర్త్ డే పార్టీలంటే.. బాలీవుడ్ స్టార్లు క్యూ కడతారు. ఇలాంటి పార్టీలు జరిగే వేదిక బయట వీరు మీడియాకు పోజులు ఇస్తూ, కెమెరాలు క్లిక్కుమంటుంటే.. ఆ హంగామానే వేరే లెవల్! అయితే కొన్నాళ్లుగా ఇలాంటి పార్టీల జోరు లేదు. బాలీవుడ్ నెలకొన్న ముంబై నగరాన్ని ప్రతి వేవ్ లోనూ కరోనా బాగా ఇబ్బంది పెడుతోంది. దీంతో బాలీవుడ్ మార్కు పార్టీల హడావుడి లేదు. ఇలాంటి క్రమంలో.. పరిస్థితి ఇటీవల కాస్త సద్దమణిగినట్టుగా కనిపించింది.
అయితే ఎక్కువ సమయం ఛాన్స్ ఇవ్వకుండా.. మహారాష్ట్రలో మూడో వేవ్ లో కూడా అప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో దీపిక తన బర్త్ డే అంటూ పార్టీని హోస్ట్ చేస్తే.. విమర్శలు జడి తప్పకపోవచ్చు.
దీంతో ఆ రిస్క్ లేకుండా.. దీపిక తన బర్త్ డే పార్టీని రద్దు చేసుకున్నట్టుగా ఉంది. పార్టీని క్యాన్సిల్ చేసుకున్నా.. దీపిక, మరో రకంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి.. మాల్దీవులకు చెక్కేసి, అక్కడ పుట్టిన రోజు ను జరుపుకుంటోంది దీపిక.