తన ముప్పై ఒకటవ పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేమబంధం గురించి వ్యక్తపరిచింది నటి రకుల్ ప్రీత్. అప్పటికే రకుల్ పై లవ్ ఎఫైర్స్ విషయంలో రూమర్లకు కొదవలేదు. ఆ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ.. రకుల్ తన బాయ్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసింది.
తనకూ ఒక లవరున్నాడని చెప్పడం ద్వారా.. రూమర్లకు తెరదించి, ప్రస్తుతం ఆ ప్రేమబంధంతో స్వేచ్ఛగా విహరిస్తోంది రకుల్. ఈ మేరకు న్యూ ఇయర్ పార్టీని జరుపుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో లండన్ వెళ్లింది. న్యూ ఇయర్ వేడుకలన్నింటినీ పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఈ లవ్ బర్డ్స్ ముంబైలో దిగారు. జంటగా ఎయిర్ పోర్టులో వీరు కనిపించడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి.
తన మకాంను ముంబైకి మార్చేసి, బాలీవుడ్ లో బిజీ అయిపోయింది రకుల్. తెలుగులో కొండపొలం తర్వాత ఈమెకు చెప్పుకోదగిన సినిమాల్లేవు. ఇక తమిళంలోనూ అవకాశాలు మృగ్యమైనట్టుగా ఉన్నాయి. అయితే బాలీవుడ్ మాత్రం రకుల్ కు అండగా నిలుస్తోంది. అక్కడ పెద్ద హీరోల సినిమాల్లోనే వరస అవకాశాలను రాబడుతూ ఉంది ఈ పంజాబీ భామ.
ఇక ఈమె బాయ్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. అతడొక సినిమా ప్రొడ్యూసర్ తనయుడు. వ్యాపార కుటుంబం. తను కూడా సినిమాల్లో నటిస్తూ ఉనికి చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తో ప్రేమాయణం ద్వారా కెమెరాలను తన వైపుకూ తిప్పుకుంటున్నాడు!