సుకుమార్ గ్రేట్… కానీ…!

సినిమాకు పనిచేయడం, రెమ్యూనిరేషన్ అందుకోవడం వేరు, ఇలా స్టేజ్ మీద ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవడం వేరు.

సాధారణంగా సినిమా రంగంలో ఒకడి క్రెడిట్ లాగేసుకుందాం, తమ ఖాతాలో వేసేసుకుందాం అని చూసే వాళ్లే తప్ప, ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి ఇవ్వాలని చూసే వాళ్లు అరుదుగా కాదు.. అసలు వుండరు. కథ.. మాటలు.. స్క్రీన్ ప్లే అంటూ మొత్తం లిస్ట్ తమ పేరు మీద వేసేసుకునే వాళ్లు ఎక్కువ. అసిస్టెంట్ లను, ఘోస్ట్ లను చాలా సైలంట్ గా వాడేసుకుంటారు. కానీ ఫర్ ఏ ఛేంజ్ దర్శకుడు సుకుమార్ అలా చేయలేదు.

సినిమాల సక్సెస్ మీట్ ల్లో దర్శకుడు తన టీమ్ ను స్టేజ్ మీదకు పిలిచి, వన్ మినిట్ అలా థాంక్స్ చెప్పేసి, కిందకు పంపేస్తారు. కానీ సుకుమార్ ఈరోజు జరిగిన మీడియా మీట్ లో అలా చేయలేదు. మొత్తం తన టీమ్ మొత్తాన్ని స్టేజ్ మీదకు పిలిచారు. ప్రతి ఒక్కరి గురించి కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. వాళ్ల స్పెషాలిటీ ఏమిటో? వాళ్లు పుష్ప 2 కి ఏ విధంగా పని చేసారో పూర్తిగా వివరంగా చెప్పుకువచ్చారు. అసలు డైరక్టర్ గా తన ఒక్క పేరు కాదు, ఎవరెవరి పేర్లు వేయాలో కూడా చెప్పేసారు. తొలిసారి బ్రీవిటీ ఆఫ్ డైలాగ్స్ అనే కార్డ్ వేసిన వైనం వివరించారు.

సినిమాకు పనిచేయడం, రెమ్యూనిరేషన్ అందుకోవడం వేరు, ఇలా స్టేజ్ మీద ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవడం వేరు. ఇలాంటివి ఓ విజిటింగ్ కార్డ్ మాదిరిగా వుండిపోతాయి అప్ కమింగ్ టెక్నీషియన్లకు. ఆ విధంగా సుకుమార్ గ్రేట్.

7 Replies to “సుకుమార్ గ్రేట్… కానీ…!”

  1. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

Comments are closed.