ఎవరు చూస్తారు.. ఎన్ని చూస్తారు అన్న సంగతి పక్కన పెడితే, దీపావళికి బోలెడు సినిమాలు వచ్చి పడుతున్నాయి. వీటిలో మూడు డబ్బింగ్ సినిమాలు, ఒక హిందీ సినిమా వున్నాయి. ఇవి కాక రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు వున్నాయి. డబ్బింగ్ సినిమాలకు కూడా ఇంతో అంతో బ్యాక్ గ్రౌండ్ వుండడం విశేషం.
దీపావళికి వస్తున్న అమరన్ సినిమా కమల్ హాసన్ భాగస్వామిగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కనుక కాస్త క్రేజ్ వుంటుంది. శివకార్తికేయన్ హీరో, పైగా ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన వారే. అందువల్ల డబ్బింగ్ సినిమా అని తీసి పక్కన పెట్టక్కరలేదు.
దీపావళికి వస్తున్న మరో డబ్బింగ్ సినిమా. క్రేజీ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కథ. కేజీఎఫ్ నిర్మాతల బ్యానర్ నుంచి వస్తోంది. మంచి థ్రిల్లర్ సినిమా అనే లుక్ వుంది. అందువల్ల కచ్చితంగా ఈ సినిమా మీద కూడా అసక్తి వుంటుంది.
లేటెస్ట్ గా ట్రయిలర్ వచ్చింది బ్లడీ బెగ్గర్. తమిళ నాట పేరున్న దర్శకుడు నీల్సన్ నిర్మించిన సినిమా ఇది. తమిళ పెద్ద దర్శకులు చిన్న చిన్న కాన్సెప్ట్ సినిమాలు స్వయంగా నిర్మించడం కామన్. అంతో ఇంతో విషయం వుంటుంది ఈ సినిమాల్లో. బ్లడీ బెగ్గర్ ట్రయిలర్ కూడా అసక్తికరంగానే వుంది. బోలెడు మంది తెలుగు నటులు కూడా వున్నారు ఈ సినిమాలో. అందువల్ల ఈ సినిమా కూడా రేస్ లో వున్నట్లే.
ఇక రెండు తెలుగు సినిమాలు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రధాన పోటీ దారులు.
అన్ని సినిమాలు జనాలకు చూడాలనే అసక్తి కలిగించేవే. అయితే మొదటి రోజే అన్నీ అందరూ చూడరు. ఒక్కో సినిమా కొంత మంది వంతున చూస్తారు. అప్పుడు మౌత్ టాక్ స్టార్ట్ అవుతుంది. అలా మంచి మౌత్ టాక్ దక్కించుకున్న సినిమాలు దీపావళికి డబ్బులు కొల్లగొడతాయి.
ఎన్ని వచ్చినా థియేటర్లో చూడం
Yendhuku
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
Call boy works 9989793850