హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ – ఈడీ నోటీసులు పంపించింది.

హీరో మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ – ఈడీ నోటీసులు పంపించింది. ఈనెల 27న విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని అందులో సూచించింది. దీంతో టాలీవుడ్ లో చిన్నపాటి కలకలం రేగింది.

గతంలో సాయిసూర్య డెవలపర్స్ అనే సంస్థకు ప్రచారం చేశారు మహేష్ బాబు. ఆ కంపెనీతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న సురానా గ్రూప్ కంపెనీపై తాజాగా ఈడీ దాడులు నిర్వహించింది. అందులో మహేష్ కు ఇచ్చిన మనీ వివరాల్ని గుర్తించింది.

వీటిపై ప్రశ్నించేందుకు మహేష్ కు నోటీసులిచ్చింది ఈడీ. తాజా సమాచారం ప్రకారం, ఈ కంపెనీకి ప్రచారం కల్పించేందుకు మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. ఇందులో కొత్త మొత్తాన్ని మహేష్ కు ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేశారు. దీనిపై ఎలాంటి వివాదం లేదు. మిగతా మొత్తాన్ని క్యాష్ రూపంలో అందించారట. దీనిపై ఈడీకి కొన్ని అనుమానాలున్నట్టు తెలుస్తోంది.

సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఎన్నో అవకతవకలకు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. అక్రమంగా లే-అవుట్స్ వేయడం, ఒకే ప్లాట్ ను వివిధ వ్యక్తులకు అమ్మడం, అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం, ప్లాట్స్ కు సంబంధించి కట్టుకథలు చెప్పడం లాంటి ఎన్నో ఆరోపణలున్నాయి.

ప్రస్తుతానికైతే వంద కోట్ల రూపాయల లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేస్తోంది ఈడీ. ఇందులో మహేష్ కు చేసిన పేమెంట్స్ కూడా ఉన్నాయి.

2 Replies to “హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు”

Comments are closed.