హ‌లో ప‌వ‌న్‌.. చింత‌మనేని దౌర్జ‌న్యంపై స్పందిస్తారా?

టీడీపీ గ్రీవెన్స్‌సెల్‌లో అనేక ద‌ఫాలు ఫిర్యాదు చేసినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని, ఇక ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటూ బాబూరావు మ‌ణిక‌ట్టు కోసుకున్నారు.

త్వ‌ర‌లో జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తాన‌ని, క్షేత్ర‌స్థాయిలో కూట‌మి నేత‌లు దోపిడీ, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడాయ‌న చిత్త‌శుద్ధికి చింత‌మ‌నేని ప‌రీక్ష పెట్టారు. దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని, ఆయ‌న అనుచ‌రులు త‌న పొలంలో అనుమ‌తులు లేకుండా మ‌ట్టి త‌ర‌లిస్తున్నార‌ని, ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని భూమి య‌జ‌మాని బాబూరావు ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

దీనికి టీడీపీ కేంద్ర కార్యాల‌యం వేదిక కావ‌డం విశేషం. గ‌త వైసీపీ పాల‌న‌లో అరాచ‌కాల‌పై ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టీడీపీ, జ‌న‌సేన పార్టీలు త‌మ కార్యాల‌యాల్లో వేదిక‌లు క‌ల్పించాయి. అయితే కూట‌మి 11 నెల‌ల పాల‌న‌లో సీన్ రివ‌ర్స్ అయ్యింది. కూట‌మి నేత‌ల అరాచ‌కాల‌పై ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములైన పార్టీల‌కు ఫిర్యాదులు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

దెందులూరు మండ‌లం చ‌ల్ల‌చింత‌ల‌పూడిలో చింత‌మ‌నేని, ఆయ‌న అనుచ‌రులు అనుమ‌తులు లేకుండా మ‌ట్టి తోల‌డంపై భూమి య‌జ‌మాని బాబూరావు, ఆయ‌న భార్య నాగ‌ల‌క్ష్మి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌య‌మై వివిధ స్థాయిల్లో అధికారుల‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని, క‌నీసం మీరైనా చేయండి అంటూ టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి బాబూరావు దంప‌తులు వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

గ‌నుల శాఖ త‌మ‌కు రూ.1.25 కోట్లు జ‌రిమానా విధించింద‌ని బాధిత దంపతులు వాపోయారు. టీడీపీ గ్రీవెన్స్‌సెల్‌లో అనేక ద‌ఫాలు ఫిర్యాదు చేసినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని, ఇక ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటూ బాబూరావు మ‌ణిక‌ట్టు కోసుకున్నారు.

ఆయ‌న్ను టీడీపీ కేంద్ర కార్యాల‌య సిబ్బంది, ఆయ‌న భార్య అడ్డుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క్షేత్ర‌స్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌జాప్ర‌తినిధులు ఏ ర‌కంగా దోపిడీ, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారో అర్థం చేసుకోడానికి ఇదో చిన్న ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. మ‌రీ ముఖ్యంగా నీతిసూక్తులు వ‌ల్లించే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు దౌర్జ‌న్యాల‌పై చ‌ర్య‌లు తీసుకుని …ఇది మంచి ప్ర‌భుత్వం అనే సంకేతాలు పంప‌డానికి మంచి అవ‌కాశం దొరికింది. వినియోగించుకుంటారా? లేదా? అనేది ఆయ‌న చిత్త‌శుద్ధిపై ఆధార‌ప‌డి వుంటుంది.

7 Replies to “హ‌లో ప‌వ‌న్‌.. చింత‌మనేని దౌర్జ‌న్యంపై స్పందిస్తారా?”

  1. నీతి “గాలి”కెగిరిపోయింది. ఆ గాలి సైకిల్ టైర్ లో ఉంది. సైకిల్ హేండిల్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. 

  2. ga గారికి జగన్ గారు తినలేదని నమ్ముతున్నారా పదిపరాకా పట్టుకొంటే ఏముంటది సంక్షేమ పధకాల ముసుగులో కొట్టేసిన దాన్ని కరెక్ట్ గ బయటకు తీస్తే ప్రతిపేదమహిళకు కులమతాలకు అతీతంగా కనీసం 50 నుంచి 70 వెలువరకు పంచవచ్చు ఆల్రెడీ జత్వాని కేసులో మరో ముఖ్యవికెట్ పడింది అదికూడా ఒక ఆర్టికల్ గ పాఠకులకు తెలియజేయండి

  3. కోడికత్తి గల్కరాయి వంటి నాటకాలు ఇలా కూడా మొదలెట్టావా 11 మోహనా?? వాళ్ళను బట్టలుఊడదీసి ఏదో చేసి, బుట్టలో వేసుకుని నాటకాలు ఆడిస్తున్నావా??

Comments are closed.