కొన్నేళ్ల కిందటి సంగతి. సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టిని పవర్ ఫుల్ విలన్ గా చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ టైమ్ లోనే ఆయన ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆదిలో ఉన్న పవర్ ను మ్యాచ్ చేసేంత బలమైన పాత్ర దొరికితే తప్ప అతడ్ని రిపీట్ చేయనన్నాడు.
మళ్లీ ఇన్నేళ్లకు అఖండ-2లోకి ఆది పినిశెట్టి వచ్చిచేరాడు. అంటే.. ఆది పినిశెట్టిని తీసుకునేంత పవర్ ఫుల్ పాత్రను బోయపాటి సృష్టించాడనుకోవాలి.
సరైనోడు సినిమా ఆది పినిశెట్టికి ఇచ్చిన ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాలో అతడు పోషించిన వైరం ధనుష్ పాత్ర, విలన్ గా చూపించిన మేనరిజమ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తే. అంత బలమైన పాత్ర లేకపోతే విలన్ గా చేయనని ఆది కూడా అప్పట్లో ప్రకటించాడు. ఇప్పుడు అఖండ-2తో మరోసారి బోయపాటి-ఆది కలిశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన భారీ సెట్ లో నడుస్తోంది. ఆదితో పాటు కొంతమంది ఫైటర్స్ పై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఈ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.
సంయుక్త మీనన్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది అఖండ-2. శివరాత్రికి ఈ సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,