తండేల్ బ్రేక్ ఈవెన్ పాస్… కానీ!

అన్ని విధాలుగా తండేల్ సినిమా చాలా మందికి మోరల్ బూస్ట్ ఇచ్చింది. ఇక ఇవ్వాల్సింది నష్టాలు రాకుండా లాభం ఇవ్వడమే.

తండేల్ సినిమాకు కాస్త మంచి టాక్ వచ్చింది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. మొత్తం మీద ఎక్కువగా పాజిటివ్ బజ్‌నే వినిపించింది. అయితే ఇప్పుడు ఇక ఫైనాన్స్ లెక్కలు చూడాల్సిందే కదా. ఈ సినిమాను దాదాపు 80 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. థియేటర్ నుంచి నలభై కోట్ల మేరకు రావాల్సి వుంది. కానీ అలా అని ఆ రేంజ్ లో అమ్మలేరు లేదా అడ్వాన్స్ లు తీసుకోలేరు. అందుకే సినిమాను 90 పర్సంట్ మేరకు స్వంతంగా విడుదల చేసుకున్నారు. కొద్దిగా విక్రయించారు. ఇలా విక్రయించడం వల్ల థియేటర్ మీద నుంచి 25 కోట్లు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. అంటే మరో పదిహేను కోట్లు బర్డెన్ వుండనే వుందని తెలుస్తోంది.

అయితే ఆ సంగతి అలా వుంచితే ఇరు రాష్ట్రాల పంపిణీ దారుల నుంచి తీసుకున్న ఇరవై అయిదు కోట్లకు మాత్రం ఢోకా లేదని క్లారిటీ డే వన్ నే వచ్చేసింది. ఏపీ(సీడెడ్ మినహా) 12 కోట్ల మేరకు అడ్వాన్స్ లు తీసుకున్నారు. అంటే విశాఖ ఏరియా 3 కోట్లు పడింది. మొదటి రోజునే ఎనభై ఎనిమిది లక్షల మేరకు షేర్ వచ్చింది. రెండు, మూడు రోజులు కలిపినా ఎంత తక్కువగా లెక్క కట్టుకున్నా రెండు కోట్లు రావచ్చు. అంటే ఫస్ట్ వీకెండ్ తరువాత రావాల్సింది జస్ట్ ఒక కోటి మాత్రమే. అంటే ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

ఇదే పరిస్థితి అన్ని ఏరియాల్లో వుంది. అందువల్ల రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్ గా తీసుకున్న పాతిక కోట్ల మేరకు అస్సలు సమస్య లేదు. కానీ కావాల్సింది అది కాదు. మరింత రన్. మరింత కలెక్షన్. మరింత ఓవర్ ఫ్లోస్. నిర్మాత బన్నీవాస్ టార్గెట్ అదే. థియేటర్ల మీద నుంచి కనీసం మరో 15 కోట్లు ఓవర్ ఫ్లోస్ వసూలు చేయాలి. అప్పుడే నిర్మాతగా బన్నీ వాస్ హ్యాపీ.

గీతా సంస్థలో బన్నీవాస్ కు సరైన బ్లాక్ బస్టర్ పడి చాలా కాలం అయింది. హీరో నాగ్ చైతన్యకు సరైన హిట్ పడి చాలా కాలం అయింది. పుష్ప సిరీస్ ను పక్కన పెడితే దేవీశ్రీప్రసాద్ కు మంచి పేరు వచ్చి బోలెడు రోజులు అయింది. ఇలా అన్ని విధాలుగా తండేల్ సినిమా చాలా మందికి మోరల్ బూస్ట్ ఇచ్చింది. ఇక ఇవ్వాల్సింది నష్టాలు రాకుండా లాభం ఇవ్వడమే.

9 Replies to “తండేల్ బ్రేక్ ఈవెన్ పాస్… కానీ!”

  1. Thandel cinema blockbuster nirmathalaki double profit vasthundhi idhi confirm

    Cinema chuthunna vallu kanta thadi pettakunda ravadam ledhu prekshakula hrudayalu kollagottadalo thandel pass iyyindhi

Comments are closed.