సీనియర్ హీరో కృష్ణ అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చాలాకాలం క్రితం వచ్చిన ఓ సమస్య మళ్లీ గత నెలరోఙులుగా తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
కృష్ణ వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఈ వయస్సులోనూ ఆయన చాలా ఆరోగ్యంగానే వుంటున్నారు. చాలా కాలం కిందట కృష్ణకు క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. కానీ అప్పట్లో ట్రీట్మెంట్ చేయించడంతో తేరుకున్నారు.ఈ సమస్య క్యాన్సర్ అని వినిపిస్తోంది.
కానీ ఇప్పుడు మళ్లీ అదే సమస్య తిరగబెట్టిందని తెలుస్తోంది.దాంతో నగరంలోని కాంటినెంటెల్ ఆసుపత్రిలో కీమో చికిత్స పొందుతున్నారని సమాచారం. హీరో మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి ఇటీవలే మరణించారు. రెండో భార్య విఙయనిర్మల కొన్నేళ్ల క్రితం మరణించారు.
దాంతో కృష్ణ ఓంటరిగానే వుంటున్నారు. నటుడు నరేష్ ఇంట్లోనే వుంటున్నారు. హీరో మహేష్ కూడా తరచు తండ్రి వద్దకు వెళ్లి, అక్కడే ఎక్కువ సమయం గడిపి వస్తున్నట్లు బోగట్టా.