అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు టైటిల్ కావాలి. ఇద్దరుహీరోల పేర్లు కలిసి వచ్చేలాంటి టైటిల్ కోసం చూస్తున్నారు. టైటిల్ ను బట్టి సినిమాలో హీరోలకు పేర్లు ఫిక్స్ చేసారు.
ఇప్పటికే బిల్లా రంగా లాంటి థర్డ్ గ్రేడ్ టైటిల్ ప్రచారం లోకి వచ్చింది. అదో పెద్ద జోక్ అని సినిమా యూనిట్ కొట్టిపారేసింది. పవన్-రానా లాంటి హీరోలను పెట్టుకుని 70ల కాలంనాటి బిల్లా రంగా లాంటి టైటిల్ పెడతామని ఎలా అనుకున్నారో అని యూనిట్ జోక్ చేసింది.
టైటిల్ బాధ్యతను దర్శకుడు త్రివిక్రమ్ కే వదిలేసారు. సినిమాకు కర్త, కర్మ,క్రియ అన్నీ ఆయనే. పేరుకు దర్శకుడు వున్నారు.
కానీ వన్ లైన్ ఆర్డర్ డిసైడ్ చేయడం, స్క్రిప్ట్ లో మేజర్ ఛేంజెస్ చేయడం,. డైలాగ్ వెర్షన్ రెడీ చేయడం అన్నీ త్రివిక్రమ్ నే చేస్తున్నారు. బహుశా షూటింగ్ రష్ చూడడం, మార్పులు చేర్పులు,రీ టేక్ లు చెప్పడం కూడా చేస్తారేమో తెలియదు.
ప్రస్తుతానికి అయితే జంటపేర్ల టైటిల్ దొరికితే అవే పేర్లు హీరోలకు పెట్టి, స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారు. అంతవరకు ఎకె రీమేక్ అని అనుకుంటూ వుండాల్సిందే.