సీఎం ఎన్టీఆర్.. నినాదాలతో దద్దరిల్లిన ఎన్టీఆర్ ఘాట్!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, న‌టుడు నందమూరి తారకరామారావు 101వ జయంతి సందర్భంగా ఆయనకు కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా తారక్ ని…

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, న‌టుడు నందమూరి తారకరామారావు 101వ జయంతి సందర్భంగా ఆయనకు కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా తారక్ ని చూసి ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.  

అభిమానులు నినాదాలు చేస్తున్నప్ప‌టికి.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించలేదు. నివాళులు అనంత‌రం మీడియాతో మాట్లాడ‌కుండా అక్క‌డి నుండి వెళ్లిపోయారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ తర్వాత బాల‌కృష్ణ ఆయ‌న సోద‌రి ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు చేరుకుని నివాళుల‌ర్పించారు.

కాగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల అనంత‌రం కొంత మంది టీడీపీ నేత‌లు జూ. ఎన్టీఆర్‌కు టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే. ప‌నిలో ప‌నిగా భ‌విష్య‌త్తులో టీడీపీ బాధ్య‌త‌లు నారా లోకేష్‌కు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. టీడీపీలోని ఒక వ‌ర్గం మాత్రం చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీ బాధ్య‌త‌లు జూ.ఎన్టీఆర్‌కు అప్ప‌గిస్తేనే పార్టీ బ‌తుకుతుంద‌ని భావిస్తున్నారు. 

భ‌విష్య‌త్తులో టీడీపీ ప‌గ్గాలు నారా లోకేష్‌నా లేక జూ. ఎన్టీఆర్‌నా అనేది ఈ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ మీద అధార‌ప‌డుతుంది. ఒక‌వేళ టీడీపీ గెలిస్తే చంద్ర‌బాబు తోడ్పాటుతో నారా లోకేష్ పార్టీని న‌డిపిన ఎవ‌రు వ్య‌తిరేకించ‌క‌పోవ‌చ్చు.. ఓడిపోతే మాత్రం పార్టీలోని సీనియ‌ర్లు త‌ప్పాకుండా జూ. ఎన్టీఆర్‌నే కావాల‌ని డిమాండ్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.