ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఫుల్ ఖాళీ. పొద్దున్న 10 వరకు పడుకోవడం, ఏదో ఒకటి తినడం, నచ్చిన పని చేసుకోవడం.. ఇలా గడిచిపోతోంది దాదాపు అందరి జీవితం. కానీ కాజల్ మాత్రం కాస్త భిన్నం. లాక్ డౌన్ టైమ్ లో కూడా తన లైఫ్ ను బిజీగా షెడ్యూల్ చేసుకుంది ఈ భామ.
“షూట్ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నానో, ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా అలానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేస్తున్నాను. లేచిన వెంటనే యోగా చేస్తాను. శాంభవి మహాముద్ర చేస్తాను. దాదాపు 45 నిమిషాలు ఉంటుందది. అది కంప్లీట్ అయిన తర్వాత కార్డియో పూర్తిచేస్తాను. ట్రెడ్ మిల్ పై 10వేల స్టెప్స్ వర్కవుట్ చేస్తాను.”
ఎక్సర్ సైజ్ పూర్తయిన తర్వత స్నానం చేసి తనే స్వయంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుందట కాజల్. బ్రేక్ ఫాస్ట్ నుంచి లంచ్ మధ్య తను చేసే పనేంటో వివరిస్తోంది.
“గుడ్లు, టోస్ట్ తో రెగ్యులర్ గా అందరూ చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏదో ఒకటి తింటాను. ఆ తర్వాత ఛెస్ నేర్చుకుంటున్నాను. చదరంగం ఆడడం వల్ల మైండ్ చాలా యాక్టివ్ అవుతుంది. ఆల్ మోస్ట్ ప్రొఫెషనల్స్ ఆడేలా ఆడాలనేది కోరిక. ఛెస్ తర్వాత ఏదో ఒకటి చదువుకుంటాను. ఆ తర్వాత లంచ్ చేస్తాను.”
లంచ్ లో కూడా ఎలాంటి స్పెషల్స్ ఉండవని చెబుతోంది కాజల్. తల్లితో కలిసి అన్నం, పప్పు, కూర లాంటివి వండుకొని తింటానని, ఆ తర్వాత కూడా రెస్ట్ తీసుకోనని చెబుతోంది. సాయంత్రం వరకు చేయాల్సిన పనులన్నీ సిద్ధంగా ఉన్నాయంటోంది.
“ఆన్ లైన్ లో ఓ కోర్స్ చేస్తున్నాను. లంచ్ తర్వాత ఆ పని ఉంటుంది. సాయంత్రం మళ్లీ యోగా చేస్తాను. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ చూస్తాను. దీంతోపాటు భగవద్గీత చదువుతున్నాను. అమ్మ, అమ్మమ్మతో కలిసి భాగవతం సత్సంగ్ కు వెళ్తాను. అప్పటికి డిన్నర్ టైమ్ అయిపోతుంది. కుటుంబంతో కాసేపు గడిపి పడుకుంటాను.”
ఇలా రోజంతా ఫుల్ బిజీగా గడుపుతున్నట్టు చెప్పుకొచ్చింది కాజల్. ఈ పనులు చేస్తూనే మళ్లీ టీవీలో వస్తున్న రామయణం, మహాభారతం కూడా చూస్తున్నానని, రెగ్యులర్ గా న్యూస్ కూడా ఫాలో అవుతున్నానని అంటోంది ఈ చందమామ.