వినే వాళ్లు ఉంటే ఎన్నైనా చెప్పొచ్చు. కంగనా రనౌత్ కు ఇలాంటి ఫాలోయర్లు కొందరు దొరికారు. దీంతో ఆమె చెప్పే శుద్ధులకు హద్దు లేకుండా పోతోంది.
కంగనా రనౌత్ తన రన్నింగ్ కామెంట్రీ చేయని అంశం అంటూ ఏదీ లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఆమె సినిమాల మీద కూడా క్రిటిక్ గా మారింది. రాజకీయాలు, మత పరమైన అంశాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఇలా రకరకాల అంశాలపై రన్నింగ్ కామెంట్రీలు చెప్పడం కంగనాకు హాబీగా మారింది.
బీజేపీ అనుకూలతను ఆయుధంగా మార్చుకుని అందరి మీదా విడ్డూరమైన కామెంట్లు చేయడం పరిపాటి. ఈ క్రమంలో ఈమె తాజా బాలీవుడ్ సినిమా గెహరాయియన్ మీద తన విలువైన అభిప్రాయాన్ని చెప్పింది. ఆ సినిమాను పోర్న్ సినిమాతో పోల్చింది కంగనా!
బహుశా కథాంశమో, దీపిక హాట్ పోజులో కంగనా కు నచ్చకపోయి ఉండవచ్చు. మరి కంగనా ఎప్పుడైనా తన సినిమాలు చూసుకుంటుందా? అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. ఇప్పుడు నీతులు చెబుతున్న కంగనా.. తన హాట్ పోజులు, తన హాట్ డ్రస్సులు, తన సినిమా కథాంశాల గురించి ఏముంటుంది! తనేదో రామాయణ, మహాభాగవత కథాంశాల మీద రూపొందిన సినిమాల్లో నటించినట్టుగా, తన సాటి వాళ్లను ఈమె పోర్న్ తో పోలుస్తోంది!
మరి బాలీవుడ్ సినిమాలను పోర్న్ తో పోలిస్తే.. అందులో తను నటించిన సినిమాలూ ముందు వరసలో నిలుస్తాయని కంగనాకు తెలియనట్టుగా ఉంది పాపం! ఈమె గురివింద కబుర్లు చెబుతూ, బీజేపీ భక్తులను మరింత వెర్రి వాళ్లను చేస్తున్నట్టుగా ఉంది!