హీరోయిన్ కియరా అద్వానీ, తను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. చేతిలో బేబీ సాక్స్ పట్టుకొని ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. “మా జీవితాల్లో గ్రేటెస్ట్ గిఫ్ట్.. కమింగ్ సూన్” అంటూ పోస్ట్ పెట్టింది కియరా. ఫొటోలో కియరా, ఆమె భర్త సిద్దార్థ్ చేతులు కనిపిస్తున్నాయి.
షేర్షా సినిమా టైమ్ లో కలుసుకున్నారు కియరా-సిద్దార్థ్. అప్పట్నుంచి ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కే వాళ్ల డేటింగ్ వ్యవహారం బయటకొచ్చింది. అలా చాన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట, 2023 ఫిబ్రవరిలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు తల్లిగా మారబోతోంది.
కియరా తల్లి కాబోతోందనే విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాశీ ఖన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, నేహా ధూపియా, హుమా ఖురేషీ లాంటి చాలామంది కియరా-సిద్దార్థ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
పాన్ ఇండియా హీరోయిన్ గా పెద్దపెద్ద సినిమాలు చేస్తోంది కియరా అద్వానీ. మొన్ననే ఆమె నటించిన గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె యష్ సరసన టాక్సిక్ అనే సినిమా చేస్తోంది. హృతిక్ సరసన వార్-2 సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తిచేసి, ఆమె కెరీర్ కు స్వల్ప విరామం ఇవ్వబోతోంది.
Congrats both of you
కాల్ మీ
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Call me
వార్ 2 లో కూడా ఈ మేడం ఏ నా