జూన్ లో కమ్ముల సినిమా ‘కుబేర’

ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో తెరకెక్కుతున్న కుబేర సినిమాకు విడుదల తేదీ లాక్ చేశారు. జూన్ 20న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల నుంచి సినిమా వచ్చి మూడేళ్లు దాటుతోంది. 2021లో కమ్ముల నుంచి చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు అతడి కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే కుబేర.

ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో తెరకెక్కుతున్న కుబేర సినిమాకు విడుదల తేదీ లాక్ చేశారు. జూన్ 20న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో నాగార్జున, ధనుష్ ను ఎదురెదురుగా చూపించారు. మధ్యలో హాలీవుడ్ నటుడు జిమ్ సెర్బ్ ను కూడా చూపించారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే కీలక పాత్రల ఫస్ట్ లుక్స్ అన్నీ రిలీజ్ చేశారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తన సినిమా పూర్తిగా సిద్ధమైతే తప్ప విడుదల తేదీని ప్రకటించడు శేఖర్ కమ్ముల. కుబేరకు డేట్ ఇచ్చారంటే సినిమా దాదాపు రెడీ అయిందని అర్థం. ప్రస్తుతానికి ఆ తేదీకి ఎలాంటి కాంపిటిషన్ లేదు. సమ్మర్ సీజన్ వరకు మాత్రమే సినిమాలు పూర్తిస్థాయిలో షెడ్యూల్ అయ్యాయి. విశ్వంభరను జూన్ లోనే విడుదల చేస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

2 Replies to “జూన్ లో కమ్ముల సినిమా ‘కుబేర’”

Comments are closed.