తన గానంతో అమృతధారను కురిపించగలడనే కితాబులు అందుకునే సింగర్ ఉదిత్ నారాయణ్. హిందీతో మొదలుపెడితే.. తను పదాలను పలకడానికి ఇబ్బంది పడే దక్షిణాది భాషల పాటలను కూడా తన గానంతో మైమరపించే స్థాయికి తీసుకెళ్లిన గాయకుడితను. భారీ స్థాయిలో అభిమానగణానికి కూడా లోటు లేదు. 45 సంవత్సరాలుగా పాటలను పాడుతూ.. అపరిమితమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఎస్పీబీ తర్వాత గత కొన్ని దశాబ్దాల్లో నంబర్ టు అనదగ్గ సింగర్ ఉదిత్ నారాయణ్.
మేల్ కేటగిరిలో ఇతర లెజెండరీ సింగర్లున్నా.. ఉదిత్ నారాయణ్ వారందరికన్నా ముందే కనిపిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఒక లైవ్ కన్సర్ట్ లో ఉదిత్ నారాయణ్ ప్రవర్తన చర్చగా మారింది. తనతో సెల్ఫీ కోసమంటూ వచ్చి, తన బుగ్గ మీద కిస్ చేసిన ఒక మహిళా అభిమాని లిప్స్ ఆయన చుంభించేయడం, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంపై ఆయన స్పందించారు!
అందులో తప్పేముందంటూ ఆయన ప్రశ్నించారు. సింగర్లకు ఇది సహజమే అని చెప్పుకొచ్చారు. గతంలో మైఖేల్ జాక్సన్ తో సహా చాలా మంది చేసిందే అన్నారు! తను 45 సంవత్సరాలుగా పాడుతున్నానని తనపై విపరీతమైన అభిమానం ఉంటుందని, అలాంటి వారితో చుంభనం అనేది ఒక ఎమోషన్ అని ఉదిత్ సమర్థించుకున్నారు.
ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం తన తీరును సమర్థించుకోవడానికి తను పాట్లు పడాల్సి రావడం ఎందుకు జరుగుతోందో ఉదిత్ కు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. ముప్పై యేళ్ల స్థాయి వయుసులో ఉన్న ఒక మహిళా అభిమాని సెల్ఫీకి వచ్చి ఆయన బుగ్గ మీద చుంభించడంలో ఆపేక్ష ఉండవచ్చు. దాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. అయితే ఒక మహిళాభిమాని పెదాలు అందే సరికి ఉదిత్ అలా స్పందించాడేమో అనే అభిప్రాయం కలుగుతుంది ఈ వీడియోను వీక్షించిన వారికి. అలాంటి వారు విపరీతంగా విరుచుకుపడుతున్నారు. ఆమె ముద్దులో ఆపేక్ష కనిపిస్తే, ఆయన ముద్దు మాత్రం మరో రకంగా అనిపిస్తోంది నెటిజన్లకు. తన తీరును సమర్థించుకునేందుకు ఉదిత్ పాట్లు పడుతున్నారు.
bro did t hesitate
Your bro’s age is 69 yrs!
haha s sir, Udit sir jus carried away i think or simply chill AF
Video ekada
కుత అనేది పలు రకాలు తీరే అవకాశం ఏదోలా దొరికింది. పాట పడేసాడు అంతే
మబ్బేసిన మధ్యాహ్నం నిద్రపోయి లేస్తే ఉండే గొంతుల ఉంటుంది. అమృత ధారట ! కి కి కి ..