ప‌న్ను మిన‌హాయింపు.. క‌న్ఫ్యూజ‌న్, క్లారిటీ రావడానికి స‌మ‌యం!

కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌లో.. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ జీతాన్ని పొందే ఉద్యోగుల‌కు పూర్తి స్థాయిలో ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌ట‌న చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. ఈ విష‌యంలో బ‌డ్జెట్ లో పూర్తి స్థాయిలో క్లారిటీ…

కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌లో.. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ జీతాన్ని పొందే ఉద్యోగుల‌కు పూర్తి స్థాయిలో ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌ట‌న చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. ఈ విష‌యంలో బ‌డ్జెట్ లో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వ‌లేద‌ని, త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో కేంద్రం క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే మాట వినిపించ‌డ‌మూ జ‌రుగుతూ ఉంది. మ‌రోవైపు వివిధ మీడియా సంస్థ‌లు ఎవ‌రి లెక్క‌లు వారు చెబుతూ ఉన్నాయి.

నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌ట‌న‌ను య‌థాత‌థంగా తీసుకుంటే.. 12 ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం పొందే వారెవ్వ‌రూ ఎలాంటి ప‌న్నూ చెల్లించ‌న‌క్క‌ర్లేదు. రెండు వంద‌ల రూపాయ‌ల ప్రొఫెష‌న‌ల్ ట్యాక్స్, దానికి తోడు పీఎఫ్ డ‌బ్బులు త‌ప్ప జీతంలో మ‌రేం క‌ట్ కాకూడ‌దు! అయితే.. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లాజ్ ఉందిక్క‌డ‌. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ 12 ల‌క్ష‌ల రూపాయ‌లు, అంత‌కు మించి జీతం పొందే ప్ర‌తి ఒక్క‌రూ క‌ట్టాలా లేదా అనే క్లారిటీ రావాలి.

ఉదాహ‌ర‌ణ‌కు 18 ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం పొందే ఒక ఉద్యోగి ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న న్యూ టాక్స్ రెజిమ్ ప్ర‌కారం.. ఏడాదికి 1.9 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల వ‌ర‌కూ ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. 18 ల‌క్ష‌ల జీతంలో.. ఏడు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఉంది ప్ర‌స్తుతం. అంటే.. అత‌డు ట్యాక్స్ క‌ట్టేది 11 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మాత్ర‌మే. 11 ల‌క్ష‌లు అంటే ఇది 10 నుంచి 15 ల‌క్ష‌ల ట్యాక్స్ స్లాబ్ లోకి వ‌స్తుంది. ఆ ప‌రిధి కి త‌గ్గ‌ట్టుగా ఏడాదికి 1.9ల‌క్ష‌ల రూపాయ‌ల మొత్తాన్ని ప‌న్నుగా చెల్లిస్తున్నాడు. ఇది ఇప్పుడు అమ‌ల్లో ఉన్న న్యూ రెజిమ్ ట్యాక్స్ విధానం. ఇదే స‌మ‌యంలో ఓల్డ్ రెజీమ్ తో కొన‌సాగుతున్న వాళ్లూ ఉన్నారు. వారి ప‌న్ను విధానంలో కాస్త తేడా ఉంటుంది. వారికి రిట‌ర్న్స్ ఉంటాయి. కానీ న్యూ రెజీమ్ వారికి రిట‌ర్నులు అనేవే ఉండ‌వు.

ఇప్పుడు ఈ న్యూరెజిమ్ వారికే కొత్త ప‌ద్ధ‌తి అమ‌ల‌వుతుందా, లేక ప్ర‌స్తుతం ఓల్డ్ రెజీమ్ లో ప‌న్ను చెల్లిస్తూ.. రిట‌ర్నులు పొందుతున్న వారికి కూడా కొత్త ప‌ద్ధ‌తి అమ‌లవుతుందో చూడాల్సి ఉంది. బ‌హుశా రిట‌ర్నులు పొందే వారికి 12 ల‌క్ష‌ల మిన‌హాయింపు ఉండ‌క‌పోవ‌చ్చు. న్యూ రెజీమ్ వారికే ఈ మిన‌హాయింపు అని సూఛాయ‌గా స్ప‌ష్టం అవుతోంది.

మ‌రి 18 ల‌క్ష‌ల జీతం పొందే ఒక ఉద్యోగి న్యూ రెజీమ్ లో ఏడాదికి అటు ఇటుగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌న్ను క‌డుతున్నాడు. మ‌రి ఇప్పుడు మినహాయింపు ప‌రిధి ఏడు నుంచి 12కు పెంచారు కాబ‌ట్టి.. కేవ‌లం ఆరు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మాత్ర‌మే ప‌న్ను క‌ట్టాలి. మొత్తం జీతం 18 ల‌క్ష‌లు కాబ‌ట్టి.. ఇది ఇర‌వై శాతం ట్యాక్స్ ప‌రిధిలోకి వ‌స్తుంది. అంటే.. మిన‌హాయింపు పోనూ మిగిలిన ఆరు ల‌క్ష‌ల్లో ఇర‌వై శాతం ట్యాక్స్ అంటే.. దాదాపు 1.2 ల‌క్ష‌ల ప‌న్ను చెల్లింపు చేయాలి! ప్ర‌స్తుతం 1.9 ల‌క్ష‌ల ప‌న్ను క‌డుతున్న వారు కొత్త విధానం ప్ర‌కారం 1.2 ల‌క్ష‌ల ప‌న్ను చెల్లించాలి. అంటే దాదాపు డెబ్బై వేల రూపాయ‌ల ఊర‌ట ద‌క్కుతున్న‌ట్టు!

అయితే.. ఇక్క‌డ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ అనే మాట త‌గులుతోంది. ఒక‌వేళ 12 ల‌క్ష‌ల పై జీతం పొందే ప్ర‌తి ఉద్యోగీ ఈ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ 75 వేలు చెల్లించాల్సిందే అంటే.. మాత్రం మిన‌హాయింపు అనేది బోగ‌స్ అవుతుంది! మిన‌హాయింపు పోనూ 20 శాతం, దానికి తోడు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ అంటే.. 18 ల‌క్ష‌ల వార్షిక జీతం పొందే ఉద్యోగి అక్ష‌రాల 1.9 ల‌క్ష‌ల వార్షిక ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అదే మొత్తం ప‌న్ను చెల్లిస్తున్నాడు! కాబ‌ట్టి.. రాలింది బూడిదే! అర్ధ‌రూపాయి తేడా లేకుండా.. మిన‌హాయింపు ఇచ్చిన ఘ‌న‌త కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంది. అయితే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ అనేది అంద‌రికీ లేక‌పోతే మాత్రం.. ఏడాదికి ఈ వార్షిక జీతంలో 70 వేల రూపాయ‌ల మిన‌హాయింపు ల‌భించిన‌ట్టే! మ‌రి అస‌లు క‌థేంటనే అంశంపై ఉద్యోగులు బుర్ర‌లు బ‌ద్ధ‌లు కొట్టుకుంటూ ఉన్నారు!

21 Replies to “ప‌న్ను మిన‌హాయింపు.. క‌న్ఫ్యూజ‌న్, క్లారిటీ రావడానికి స‌మ‌యం!”

  1. ఇన్కమ్ ట్యాక్స్ పాత/క్రొత విధానాలు కాస్త అర్థం అయ్యేలా….

    ఇప్పుడు 12 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఇదివరకు 7 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉండేది.

    ఒకవేళ ఆదాయం రూ. 12 లక్షలు దాటితే,

    4 లక్షల వరకు మినహాయింపు (ఇదివరకు 3 లక్షల వరకు ఉండేది.

    4 నుండి 8 లక్షల వరకు 5% ( ఇదివరకు 3-7 లక్షల వరకు 5% ఉండేది).

    8 నుండి 12 లక్షల వరకు 10% ( ఇదివరకు 7-10 లక్షల వరకు 10% ఉండేది).

    12 – 16 లక్షల వరకు 15% ( ఇదివరకు 10-12 లక్షల వరకు 15% ఉండేది).

    16 – 20 లక్షల వరకు 20% ( ఇదివరకు 12-15 లక్షల వరకు 20% ఉండేది).

    20-24 లక్షల వరకు 25% ( ఇదివరకు 15 లక్షల పైన 30% ఉండేది).

    24 లక్షల పైన 30% ( ఇదివరకు 15 లక్షల పై నుండి 30% ఉండేది).

    కొత్త విధానం ప్రకారం 24 లక్షల పై ఆదాయం ఉన్నవారికి కూడా శ్లాబులు మార్చడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.

  2. ఈ గ్రేట్ ఆంధ్ర కు ఒక జబ్బుంది. వీళ్ళు రాసే చెత్త కు ఆధారాలతో సమాధానం ఇస్తే వెంటనే తీసేస్తారు. వీళ్ళు చేసే అబద్దాల ప్రచారాలు కు వ్యతిరేకంగా ఉంటే వెంటనే డిలీట్ చేసేస్తారు. నీచమైన జర్నలిజం

  3. ఈ దరిద్రులు రాసిన చెత్త నమ్మి తీరాలి. కాదని రుజువులు పెడితే తీసేస్తారు. నీచమైన

  4. అసలు ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961 ను ఒక్క సారి కూడా చదవకుండా ఈ ఆర్టికల్ ను రాసిన ఘనత కేవలం ఈ వెబ్ సైట్ కు మాత్రమే దక్కుతుంది

  5. ఎవడ్రా ఈ ఆర్టికల్ రాసింది.. కనీస౦ ఒకటి నుండి పది వరకు అంకెలు కూడా రావు వీడికి

  6. ఎవడో మన ఇంటర్ ఫెయిల్ bipc, ఎంపీసీ, cec dcm candidate మల్లె ఉన్నాడు ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళు.

Comments are closed.