చ‌చ్చిపోవ‌ద్ద‌మ్మా హీరోయిన్…

‘‘న‌చ్చావులే’’ హీరోయిన్ మాధ‌వీల‌త తాను చ‌నిపోతానంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తీవ్ర అల‌జ‌డి రేపుతోంది. ‘‘చ‌చ్చిపోవ‌ద్దంటూ’’ అభిమానులు వేడుకుంటున్నారు. కొంత కాలంగా తాను చ‌చ్చిపోతాన‌ని స్నేహితుల‌కు కూడా చెబుతున్నాన‌ని ఆమె…

‘‘న‌చ్చావులే’’ హీరోయిన్ మాధ‌వీల‌త తాను చ‌నిపోతానంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తీవ్ర అల‌జ‌డి రేపుతోంది. ‘‘చ‌చ్చిపోవ‌ద్దంటూ’’ అభిమానులు వేడుకుంటున్నారు. కొంత కాలంగా తాను చ‌చ్చిపోతాన‌ని స్నేహితుల‌కు కూడా చెబుతున్నాన‌ని ఆమె వెల్ల‌డించారు. చ‌నిపోవాల‌నే పిచ్చి ఆలోచ‌న‌లు, పిచ్చిప‌నులు చేయ‌వ‌ద్దంటూ అభిమానులు హిత‌వు ప‌లుకుతున్నారు.

ఏదో ఒక‌రోజు ‘ప్రేమ’ సినిమా లో రేవతిలా చచ్చిపోతానని గురువారం అర్ధ‌రాత్రి ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ప్రేమ సినిమాలో రేవ‌తి ఏదో ఒక మెడిసిన్‌ను ఎప్పుడూ వేసుకునేవారు. చివ‌రికి ఎలాంటి మందు ప‌నిచేయ‌కుండా త‌న‌వు చాలిస్తుంది. ఆ చావుతో పోల్చి తాను ప్రాణం తీసుకుంటాన‌ని మాధ‌వీల‌త చెప్ప‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ధైర్యంగా ఉండాల‌ని ఆమెకు అభిమానులు, స్నేహితులు భ‌రోసా ఇస్తున్నారు.

తాను చావాల‌నుకునే నిర్ణ‌యానికి రావ‌డానికి అనారోగ్య స‌మ‌స్య‌లే కార‌ణ‌మ‌ని ఆమె తెలిపారు. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి ఎప్పుడూ తనను ఏడిపిస్తాయని ఆమె వాపోయారు. తనకు మందులంటే అసహ్యమని, కానీ  వాటిని వేసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని  మాధ‌వీల‌త వివ‌రించారు.  అయితే తాను ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంద‌న్నారు.
 
 త‌న‌కు జీవించాల‌నే ఉంద‌ని, కలలు, కోరికలు, ఆశలున్నాయ‌ని మాధ‌వీల‌త తెలిపారు. కానీ ఈ మందులు తన ఆయుష్షును ఉంచవేమో అని భయాన్ని వెల్ల‌డించారామె. ఆరోగ్యమే అసలైన సంపద అంటార‌ని, కానీ త‌న‌ విషయంలో మాత్రం అది నిజం కాదని హీరోయిన్ మాధ‌వీల‌త చెప్ప‌డం గ‌మనార్హం.

ఇది అర్జున్ రెడ్డి సినిమా కాదు

వాళ్లిద్దరూ నన్ను ఎలా పడేయాలా అని చూసారు