న్యూ ఇయర్ లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో హీరోయిన్ల నిర్ణయాలు మాత్రం కామన్ గా ఉంటాయి. ఎక్కువ సినిమాలు చేయాలి, మరింత క్రేజ్ తెచ్చుకోవాలని మాత్రమే వీళ్లు ఆలోచిస్తుంటారు. అయితే ఇక్కడో హీరోయిన్ మాత్రం కొత్త ఏడాదిలో వెరైటీగా ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది బరువు పెరగాలనేది ఆమె లక్ష్యం అంట.
ఈ వెరైటీ టార్గెట్ పెట్టుకున్న హీరోయిన్ మాళవిక శర్మ. అవును.. కొత్త ఏడాదిలో కాస్త బరువు పెరగాలనే నిర్ణయం తీసుకున్నట్టు బయటపెట్టింది మాళవిక. ఈమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ కారణం కూడా ఉంది.
కొన్నాళ్లుగా బరువు పెరగడానికి ప్రయత్నిస్తోందంట ఈ ముద్దుగుమ్మ. కానీ తన శరీరతత్వానికి బరువు పెరగడం సాధ్యం కావడం లేదంటోంది. అందుకే 2021లో ఓ డైటీషియన్, ఓ ఫిట్ నెస్ ట్రయినర్ ను అపాయింట్ చేసుకొని మరీ కాస్త బరువు పెరుగుతానంటోంది.
హీరోయిన్లు స్లిమ్ గా ఉండాలని కోరుకుంటారు. మాళవిక శర్మ కూడా స్లిమ్ గా ఉంటుంది. కానీ అంత స్లిమ్ నెస్ పనికిరాదని, సౌత్ సినిమాల కోసం కాస్త బొద్దుగా మారాలని అనుకుంటున్నట్టు తెలిపింది మాళవిక.
22 ఏళ్ల ఈ ముంబయి ముద్దుగుమ్మ.. తెలుగులో నేలటిక్కెట్టు సినిమా చేసింది. కానీ అది కాస్తా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం రామ్ తో రెడ్ అనే మూవీ చేసింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ.