మాస్ మహరాజ్ లిప్ లాక్

ఎంత హీరో అయినా పెదవి పెదవి కలపడం అంటే మామూలుగా హుషారు వుండదు. అందుకే ఇప్పుడు పెద్ద హీరోలు కూడా లిప్ లాక్ కు సై అంటున్నారు. ఈ లైన్ లో మాస్ మహరాజా…

ఎంత హీరో అయినా పెదవి పెదవి కలపడం అంటే మామూలుగా హుషారు వుండదు. అందుకే ఇప్పుడు పెద్ద హీరోలు కూడా లిప్ లాక్ కు సై అంటున్నారు. ఈ లైన్ లో మాస్ మహరాజా రవితేజ‌ కూడా చేరారు. 

క్రాక్ సినిమా లాంటి హిట్ తరువాత ఆయన చేస్తున్న సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో ఆయన సరసన ఇద్దరు యంగ్ హీరోయిన్లు నటిస్తున్నారు.

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తయారవుతోంది. ఓ పక్క ఛేజ్ లు, మాస్ యాక్షన్ సీన్లతో పాటు ఓ మాంచి లిప్ టు లిప్ కిస్ సీన్ కూడా మాస్ మహరాజా రవితేజ‌ అద్భుతంగా చేసేసినట్లు తెలుస్తోంది.

సినిమాలో డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మరి ఈ ఇద్ద‌రిలో ఎవరికి రవితేజ‌ ముద్దు పెట్టాడు అన్నది ట్రయిలర్ విడుదలయితే కానీ తెలియదు. మొత్తం మీద సినిమాను ఫుల్ గా మాస్ మసాలాలతో ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది.