Advertisement

Advertisement


Home > Movies - Movie News

మీడియా లేని మీడియా మీట్

మీడియా లేని మీడియా మీట్

టాలీవుడ్ లో మీడియా మీట్ లు అన్నవి కామన్. కానీ ఈ రోజు టాలీవుడ్ లో చిత్రమైన మీడియా మీట్ జరిగింది. ఈ మీడియా మీట్ లో మీడియా జనాలు లేరు. అలా అని ఏ జనాలూ లేరు. కేవలం ఓ కెమేరా. ఎవరైతే, మీడియా మీట్ లో పాల్గొనాలని అనుకున్నారో, వాళ్లు పాల్గోన్నారు. మాట్లాడారు. సినిమాకు వాళ్లకు యాక్షన్..టేక్..కట్..ఓకె..అనే విధంగా కానిచ్చేసారు.

గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ హడావుడి చాలా ఎక్కువగా వుంది. అటు కౌన్సిల్..ఇటు గిల్డ్ రెండు వర్గాలు టాలీవుడ్ లో వున్నాయన్నవి వాస్తవం. అందరూ ఒకటే అయితే గిల్డ్ అనేది ప్రత్యేకంగా ఎందుకు? అన్న ప్రశ్న వుండనే వుంది. అక్కడికేదో మీడియాదే పాపం అన్నట్లుగా గిల్డ్ అని రాయకండి అంటూ హితవు. 

కొంత మంది గిల్డ్ అన్నది పెట్టుకోవడం అవాస్తవమా? గిల్డ్ మీటింగ్ లు అంటూ జరుపుకోవడం అవాస్తవమా? ఇక్కడ మీడియా చేసింది ఏముంది?

పైగా మీడియాను పిలిచి చెప్పొచ్చు..మీడియా సందేహాలు తీర్చ వచ్చు. కానీ అలా చేయకుండా ఓ కెమేరా తెచ్చి, ప్రెస్ మీట్ సెట్ మాదిరిగా అందరూ కూర్చుని, ఎదురుగుండా ప్రెస్ వున్నట్లే హావ భావాలు ప్రకటిస్తూ వీడియో షూట్ చేసి వదలడం అంటే భలేగా వుంది కదా? అదేంటీ ఇలా అని ఓ కీలక వ్యక్తిని అడిగితే, మీడియా వస్తే మళ్లీ అనేక ప్రశ్నలు వేస్తారు. 

కొన్ని సినిమాల షూటింగ్ లు ఆపకపోవడం మీద ప్రశ్నిస్తారు. ఆ తలకాయ నొప్పి ఎందుకుని ఇలా కానిచ్చినట్లున్నారు అంటూ సమాధాం చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?