ఎట్టకేలకు బ్యాచిలర్ కు దారి దొరికింది

అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇప్పటిది కాదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.…

అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇప్పటిది కాదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అక్టోబర్ 8న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించింది గీతాఆర్ట్స్-2 సంస్థ.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ ను కూడా వదిలారు. అంతలోనే కరోనా పీక్ స్టేజ్ కు చేరడంతో ఎక్కడి ప్రచారం అక్కడ ఆగిపోయింది. సినిమా విడుదల నిలిచిపోయింది.

అలా ఆగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను ఇప్పుడు మళ్లీ బయటకు తీశారు. మధ్యలో డైరక్ట్ ఓటీటీ ఆఫర్లు వచ్చినప్పటికీ, మేకర్స్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే ఫిక్స్ అయ్యారు. చెప్పినట్టుగానే ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించారు. 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమాకూ సోలో రిలీజ్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8కి ఇంకెన్ని సినిమాలు రెడీ అవుతాయో చూడాలి. అయితే దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ ఓ మాట అనుకుంటే బ్యాచిలర్ కు సోలో రిలీజ్ పెద్ద కష్టమేం కాదు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు. దర్శకుడు ఈ సినిమాను కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా చెబుతుంటే, హీరో ఈ సినిమాను రొమాంటిక్ మూవీ అంటున్నాడు.