మన సీనియర్ హీరోలు మారరు. ఆరు పాటలు, మూడు ఫైట్లు పట్టుకునే వేలాడుతూ వుంటారు. రీమేక్ లు తెచ్చుకోవడం లేదా మాస్ కథ లు ఎంచుకోవడం రెండే మార్గాలు. జనం బాక్స్ లను ఇట్టే వెనక్కు పంపిస్తున్నా పట్టు వదలని విక్రమార్కుళ్ల మాదిరిగా ప్రయత్నిస్తూనే వుంటారు.
హీరో నాగ్ చాలా వెరైటీ సినిమాలు చేసారు. అలా చేసినపుడల్లా జనం ఆదరించారు. బట్ రొటీన్ సినిమాలు, 60 ఏళ్లు దాటేసినా కుర్ర హీరోయిన్లతో గెంతులు వేసినపుడల్లా వెనక్కు పంపారు.
రకుల్ ప్రీత్ సింగ్ తో పాతికేళ్ల కుర్ర వేషాలు ట్రయ్ చేసాడు నాగ్..మన్మధుడు 2 అంటూ డిజాస్టర్ కా బాప్ అయిపోయింది.
ఓటిటి వెబ్ సిరీస్ లను చూసి వైల్డ్ డాగ్ అంటూ గన్ కల్చర్ తో ట్రయ్ చేయబోతే, జనం మళ్లీ చటుక్కున పక్కన పెట్టారు.
బిగ్ బాస్ లో మళ్లీ అదే మూవ్ మెంట్స్, అదే నవ్వు..ఈసారి జనానికి పట్టలేదు.
ఇక మిగిలిన చివరాఖరి చాన్స్. బంగార్రాజు. గతంలో హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్. పైగా ఈసారి చైతన్య తోడు వున్నాడు. గతంలో క్లిక్ అయిన బంగార్రాజు క్యారెక్టర్. అదే మోటు, నాటు సరసం.
మరి ఇదయినా క్లిక్ అయితే, ఈ ఏజ్ కు తగిన పాత్ర అని అటే ట్రయ్ చేసుకోవచ్చు. లేదూ అంటే ఇక నాగ్ పూర్తిగా హీరోయిజం కు స్వస్తి చెప్పి, పక్క భాషల సీనియర్ హీరోల మాదిరిగా మంచి పాత్రల కోసం ట్రయ్ చేయాల్సిందే.