నాగచైతన్య వెడ్స్ లక్ష్మీ శోభిత

సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లి శుభలేఖ వైరల్ అవుతోంది. అన్నీ తెలిసిన విషయాలే ఉన్నప్పటికీ 2 విషయాలు కొత్తవి ఉన్నాయి. Advertisement నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టుడియోస్ లో జరగుతుందనే…

సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లి శుభలేఖ వైరల్ అవుతోంది. అన్నీ తెలిసిన విషయాలే ఉన్నప్పటికీ 2 విషయాలు కొత్తవి ఉన్నాయి.

నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టుడియోస్ లో జరగుతుందనే విషయం తెలిసిందే. వైరల్ అవుతున్న శుభలేఖలో వివాహ ముహూర్తం ఉంది. 4వ తేదీ రాత్రి 8 గంటల 13 నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు చైతూ.

ఇక వెడ్డింగ్ కార్డులో అందర్నీ ఆకర్షించిన మరో విషయం ఏంటంటే.. శోభిత పేరు. ఆమె కేవలం శోభిత కాదు, ఆమె పూర్తి పేరు ధూళిపాల లక్ష్మీ శోభిత అనే విషయం బయటకొచ్చింది.

ఆగస్ట్ లో నాగచైతన్య-శోభిత ఎంగేజ్ మెంట్ జరిగింది. గత నెలలో గోధమరాయి (పసుపు దంటే) ఫంక్షన్ నిర్వహించి, పెళ్లి పనులు మొదలుపెట్టారు. అవన్నీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇరు కుటుంబాలు తమ స్నేహితులు, బంధువులకు శుభలేఖలు పంచే కార్యక్రమం దాదాపు పూర్తిచేశారు.

అటు నాగచైతన్య, శోభిత పెళ్లి దుస్తుల డిజైనింగ్ కూడా పూర్తయింది. ఈ నెలాఖరుకు దుస్తులు రెడీ అవుతాయి. పెళ్లి సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇవ్వబోతోంది శోభిత. స్వతహాగా మోడల్ అయిన ఈమె, పారిస్ వెళ్లి ప్రత్యేకంగా షాపింగ్ చేసినట్టు తెలుస్తోంది.

7 Replies to “నాగచైతన్య వెడ్స్ లక్ష్మీ శోభిత”

  1. ఎవడి పేరు ఏదైతే ఎవడికీ కావాలి? శోభిత అయినా లక్ష్మీ శోభిత అయినా … పేరులో ఏముంది

  2. లక్ష్మీ అని ఎక్కడ ఉంది? చిలసౌ అని అందరి పెళ్లి కూతుర్లని సంబోధిస్తారు…

  3. గొప్ప గొప్ప వంశాలు కలుస్తున్నాయి.. గొప్ప గొప్ప సంతానం కలుగుతుంది…

Comments are closed.