నాని ‘నాయకుడు’ గెటప్

మణిరత్నం-కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ నాయకుడు గుర్తుందా? అందులో యంగ్ కమల్ హాసన్  గెటప్ గుర్తుందా? లేదూ అంటే ఓసారి శ్యామ్ సింగ రాయ్ లో నాని గెటప్ చూడండి. పక్కాగా గుర్తుకు…

మణిరత్నం-కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ నాయకుడు గుర్తుందా? అందులో యంగ్ కమల్ హాసన్  గెటప్ గుర్తుందా? లేదూ అంటే ఓసారి శ్యామ్ సింగ రాయ్ లో నాని గెటప్ చూడండి. పక్కాగా గుర్తుకు వస్తుంది. పునర్జన్మల కాన్సెప్ట్ తో తయారవుతున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. రాహుల్ దర్శకుడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఆ ఆటిట్యూడ్ అంతా నాయకుడులో కమల్ ను గుర్తుకు తెస్తున్నాయి. బహుశా కథలో పూర్వకాలం పాత్ర కాబట్టి అలా డిజైన్ చేసి వుండొచ్చు. 

సినిమాలో నాని పూర్వ జన్మ వ్యవహారం అంతా కలకత్తా నేపథ్యంలో వుంటుంది. ప్రేమ కథ కూడా ఆ జన్మలోనే. ఫస్ట్ లుక్ ను ఆ గెటప్ తోనే ఇచ్చారు. పోస్టర్ లో కలకత్తా నేపథ్యం తెలిసేలా డిజైన్ చేసారు. నాని క్యారెక్టర్ రచయిత కనుక బ్యాక్ గ్రవుండ్ లో ప్రెస్, కలకత్తాలో కనిపించే లాగుడు బండి, కలకత్తా సంస్కృతిని ప్రతిబింబించే డిజైన్ సెట్  చేసారు.

హీరోయిన్ సాయిపల్లవిని హీరో వెనుక దాచేసి చూపించడం విశేషం. నీహారిక ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి