పరిష్కారం దిశగా థియేటర్ల సమస్య

టాలీవుడ్ ను కలవరపెడతూ, సంక్షోభంలో చిక్కుకునేలా చేసిన టికెట్ లు, థియేటర్ర సమస్య ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత్తం ఆంధ్రలో రెండు…

టాలీవుడ్ ను కలవరపెడతూ, సంక్షోభంలో చిక్కుకునేలా చేసిన టికెట్ లు, థియేటర్ర సమస్య ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత్తం ఆంధ్రలో రెండు సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి థియేటర్ల అస్తవ్యస్త పరిస్థితిని దారిలోకి తేవడం. రెండవది టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్లు అమ్మకుండా తగ్గింపు రేట్లు అమలు చేయడం.

అయితే ఈ రెండు విషయాలు థియేటర్లకు, ఇండస్ట్రీకి ఇబ్బందిగా మారాయి. థియేటర్ల లైసెన్స్ లు, సేఫ్టీ రెన్యువల్ అనేవి యజ‌మానులు పాటించాల్సినవి. అవి చక్కదిద్దుకోవడం అన్నది వాళ్ల చేతిలోనే వుంది. ఇన్నాళ్లుగా చట్టబద్దంగా వ్యవహరించక ఈ పరిస్థితి వచ్చింది. ఆ సంగతి పరిష్కారం అన్నది వాళ్ల చేతిలోనే వుంది.

ఇక టికెట్ ల సమస్య. ఇప్పుడు ఈ సమస్య మీదే ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాలీవుడ్ లోని కొంతమందితో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ముందుగా సి సెంటర్ థియేటర్ల రేట్లను సవరించి, ఆపైన టికెట్ రేట్లు ఎలా వుండాలి అన్నదానిపై ఇండస్ట్రీ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్, ఎగ్ఙిబిటర్లు యువి వంశీ, వైజాగ్ వీరునాయుడు, డైరక్టర్ మహీ, నిర్మాత బాపినీడు తదితరులు ఈ కమిటీలో వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ కమిటీ తో ప్రభుత్వ అధికారులు సమాలోచనలు జ‌రిపి టికెట్ రేట్లు, థియేటర్ల సమస్యలు, పరిష్కారాలు, అలాగే అదనపు ఆటలు ఏ మేరకు ఇవ్వాలి అనే వాటిపై ఓ నివేదిక తయారు చేసి సిఎమ్ జ‌గన్ కు అందిస్తాయని తెలుస్తోంది. 

ఇవన్నీ కాస్త ఫాస్ట్ ట్రాక్ మీదే జ‌రుగుతాయని అమరావతి వర్గాల బోగట్టా. చూడాలి ఏం జ‌రుగుతుందో?