పవన్…ఇన్నాళ్లకో మంచి నిర్ణయం

ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ అంటారు ఎక్కడైనా. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏనాడో ఒకె చేసి అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు పక్కన పెట్టి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఫినిష్ చేసారు. …

ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ అంటారు ఎక్కడైనా. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏనాడో ఒకె చేసి అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు పక్కన పెట్టి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఫినిష్ చేసారు. 

హరిహర వీరమల్లు సినిమా నడుస్తూనే వుంది. మైత్రీ మూవీస్ సినిమా లేదు అనకుండా ఎప్పటికప్పుడు ఓ గ్రూప్ ఫొటో వదులుతూనే వున్నారు.

ఇలాంటి నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ తో ఒకటి, వైష్ణవ్ తేజ్ తో మరొకటి ఓకె చేసారని వార్తలు వచ్చేసాయి. కానీ ఇప్పుడు పవన్ మనసు మార్చుకున్నారు. 

ఎకాఎకిని ‘హరిహర వీరమల్లు’ సినిమా ఫినిష్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్, మే నెలల్లో ఎక్కడ గ్యాప్ వుంటే అక్కడ డేట్ లు అన్నీ ఆ సినిమాకే కేటాయించినట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ సినిమాను జూన్ నెలకు పంపించారు. హరి హరి వీరమల్లు సినిమా పినిష్ చేసి ఆ సినిమా మీదకు వెళ్తారు. జూన్, జూలై నెలలు ఆ సినిమాకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత మైత్రీ సినిమానా? వైష్ణవ్ తేజ్ సినిమా అన్నది తేల్చాల్సి వుంటుంది.

మొత్తానికి ఏమైతేనేం హరి హర వీరమల్లు సినిమాకు కాస్త మంచి రోజులు వచ్చినట్లే. క్రిష్ రూపొందించే ఈ సినిమాలో పవన్ జానపదాల్లో కనిపించే రాబిన్ హుడ్ టైప్ దొంగ క్యారెక్టర్ చేస్తున్నారు. గతంలో మధుబాబు రచించిన షాడో నవలల్లో, ఇలాంటి క్యారెక్టర్ తో కొన్ని కథలు వచ్చాయి.