ప్రతి హీరోయిన్ కు మనసులో కొన్ని కోరికలుంటాయి. ఫలానా పాత్ర చేయాలని ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ కోరికలు కూడా మారుతుంటాయి. అయితే పూజాహెగ్డేకు మాత్రం ఒకటే కోరిక ఉంది. ఎన్నేళ్లు గడిచినా ఓ కోరికలో ఎలాంటి మార్పు ఉండదంటోంది. ఆమె మనసులో ఉన్న ఆ డిఫరెంట్ కోరిక ఏంటో తెలుసా?
“మహిళల కోసం ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. ఎందుకంటే, అమ్మాయిలకు కావాల్సినంత కంటెంట్ లేదని నా అభిప్రాయం. మహిళా లోకానికి ఇప్పటివరకు నేను ప్రాతినిధ్యం వహించలేదనిపిస్తోంది. తెరపై ఏదైనా చూసినప్పుడు మనం కూడా అలా మారిపోవాలని కోరుకుంటాం. అదే స్థానంలో ఓ బలమైన మహిళ ఉంటే అది మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే అమ్మాయిల్ని ఉత్తేజపరిచే సినిమాల్ని ఎక్కువగా చేయాలని ఉంది.”
ఇలా మహిళలు, మరీ ముఖ్యంగా యంగ్ అమ్మాయిల కోసం సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది పూజా హెగ్డే. తనకు ఇంకా చాలా కెరీర్ ఉందని, కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా యంగ్ గర్ల్స్ కు స్ఫూర్తినిచ్చే సినిమాలు చేస్తానని ప్రకటించింది. డైరక్ట్ గా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తానని చెప్పకుండా, ఇలా పరోక్షంగా మనసులో కోరిక బయటపెట్టింది పూజాహెగ్డే.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అత్యథిక పారితోషికం తీసుకుంటోంది. కుర్రాళ్లను పిచ్చెక్కించే గ్లామర్ పాత్రలు పోషిస్తోంది. మరి ఇలాంటి టైమ్ లో ఆమెకు ఫిమేల్ కంటెంట్ కథలు దక్కుతాయా అనేది చూడాలి.