ఆదిపురుష్ సినిమా టైమ్ లో ప్రభాస్ వాకింగ్ స్టయిల్ చూసి అభిమానుల గుండె చివుక్కుమంది. అమ్మాయిల మనసులైతే నలిగిపోయాయి. ఏంటి మా డార్లింగ్ కు ఇలా అయిందంటూ ఒకటే బాధ. ఎప్పుడైతే ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడో, అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లేట్ అయినా పర్వాలేదు, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. అందరి ప్రేమ, ఆకాంక్షలు, అభిమానుల మొక్కులు ఫలించాయి. ప్రభాస్ ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. అతడి వాకింగ్ స్టయిల్ సాధారణంగా ఉంది. ఆదిపురుష్ ప్రమోషన్ టైమ్ లో కుంటినట్టు అతడి నడక లేదు.
ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ నడుస్తున్నప్పుడు తీసిన వీడియోలు బయటకొచ్చాయి. అతడు తన మునుపటి వాకింగ్ స్టయిల్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల పరిస్థితేంటి..?
ప్రభాస్ ల్యాండ్ అవ్వడంతో అతడి సినిమాలపై మరోసారి చలనం వచ్చింది. అయితే అన్నింటికంటే ముందు అతడు సలార్ పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. వచ్చేనెల సలార్ రిలీజ్ ఉంది. ప్రభాస్ ఇండియాకొచ్చిన తర్వాత ట్రయిలర్ లాంచ్ పెట్టుకున్నారు. దీంతోపాటు ప్రభాస్ పై ఓ ఇంటర్వ్యూ కూడా షూట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
ఇక కల్కి సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టే అవకాశం ఉంది. అటు మారుతి సినిమా మాత్రం ప్రభాస్ లేకపోయినా షూటింగ్ కొనసాగిస్తున్నారు. హీరో తో సంబంధం లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఇంటికొచ్చిన ప్రభాస్ మరికొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఈ గ్యాప్ లో ఫిజియోథెరపీ చేయించుకొని, పూర్తిగా ఫిట్ అయిన తర్వాత సెట్స్ పైకి వస్తాడు.