ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను లైంగిక వేధింపుల ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో ఓ యువతిని ప్రైవేట్ భాగాలను తాకడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అతడిని విచారించి కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ సమయంలో తనను లైంగికంగా వేధించారని, అలాగే మెకానిక్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ప్రసాద్‌పై బాధితురాలు ఆరోపించారు. ఎంత చెప్పినా వేధింపులు తగ్గకపోవడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ప్రసాద్ బెహరా, తర్వాత రచయితగా, నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటారు. ఇటీవల కమిటీ కుర్రాళ్లు అనే సినిమాలో నటించడంతో మంచి పేరు వచ్చింది. తాజా ఘటనతో అతడి కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
Time to join JSP and get a clean chit same as Johny Master
అతను ఆలా ప్రవర్తించి ఉంటె ఖచ్చితంగ తప్పే. కానీ నాకు ఒక అనుమానం. పెళ్ళివారమండి లో తప్పుగా ప్రవర్తించాడు, మరి మల్లి మెకానిక్ లో మల్లి చేసింది. ఆ అమ్మాయి సెకండ్ వెబ్ సిరీస్ ను అవాయిడ్ చేసి ఉండచ్చు. ఎవరిదీ తప్పో ఏమో ???
After usage payment తప్పు
After usa….ge paym….ent తప్పు
Af..ter us…a…ge pay…me…nt త….ప్పు