డిసెంబర్ అయిపోయింది.. జనవరి పండగ సినిమాల సంగతి బాకీ వుంది. జనవరి మూడో వారం నుంచి శివరాత్రి వరకు సినిమాల లైనప్ అన్నది కామన్. కానీ ఈసారి ఈ లైనప్ మరింత ఎక్కువగా వుండేలా వుంది చూస్తుంటే. సంక్రాంతికి ఈసారి జస్ట్ మూడే సినిమాలు వస్తున్నాయి. ఈ సంక్రాంతి సినిమాలకు కనీసం రెండు వారాలు గ్యాప్ వదిలేయాల్సి వుంది. అంటే జనవరి మూడో వారం దగ్గర నుంచి సినిమాల విడుదల ప్లాన్ చేయాలి. అక్కడికి మిగిలింది నాలుగు నుంచి అయిదు వారాలు.
జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి ఆఖరుకు ఆరు శుక్రవారాలు వున్నాయి. వీటిలో ఫిబ్రవరి ఆఖరి శుక్రవారాన్ని లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మార్చి ఫస్ట్ నుంచి నెలాఖరు వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్, అందునా. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ప్లాన్ చేసారు. అందువల్ల సినిమాల విడుదల క్యాలండర్ లోంచి మార్చి ని తీసేయాల్సిందే. అంటే మిగిలింది అయిదు శుక్రవారాలు. వీటిలో జనవరి మూడో వారంలో ఒకటి, ఫిబ్రవరిలో మూడు కీలకంగా వున్నాయి.
అంటే నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకోవచ్చు. సోలో డేట్ లు కావాలనుకుంటే. ఇప్పుడు ఈ తేదీల కోసం, సారంగపాణి జాతకం, లైలా, మ్యాడ్ 2, తమ్ముడు, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు అన్నీ వున్నాయి. ఇవి కాక మరి కొన్ని సినిమాలు కూడా ఫిబ్రవరి వైపు చూస్తున్నాయి. ఎక్కువ మందికి ఫిబ్రవరి 21 డేట్ కావాలి. ఎందుకంటే దానికి కంటిన్యూగా శివరాత్రి సెలవులు యాడ్ అవుతాయి.
మొత్తం మీద చూసుకుంటే పోస్ట్ పొంగల్ టైమ్ లో వారానికి రెండు వంతున దాదాపు ఎనిమిది, పది సినిమాల వరకు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. పైగా అవన్నీ కాస్త హిట్ అవుతాయి అని ఆశించి వస్తున్న సినిమాలే. ఇవి కాక అతి చిన్న సినిమాలు వుండనే వుంటాయి.