ఇక రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేయలేరు

లావణ్య వివాదంలో కూరుకుపోయిన హీరో రాజ్ తరుణ్ పై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులివ్వగా, రాజ్ తరుణ్ హాజరవ్వలేదు.…

లావణ్య వివాదంలో కూరుకుపోయిన హీరో రాజ్ తరుణ్ పై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులివ్వగా, రాజ్ తరుణ్ హాజరవ్వలేదు. తన తరఫు లాయర్ ను స్టేషన్ కు పంపించాడు.

ఆ వెంటనే రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వరుసగా కథనాలు వచ్చాయి. ఇప్పుడా ఛాన్స్ లేదు. తెలంగాణ హైకోర్టు రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అతడ్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది.

బెయిల్ ఇలా వచ్చింది..!

రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో లావణ్యను కోర్టు సూటిగా ప్రశ్నించింది. రాజ్ తో పెళ్లయినట్టు ఆధారాలున్నాయా అని అడిగింది. ఆధారాలు లేవని చెప్పడంతో, కనీసం పెళ్లికి సంబంధించి శుభలేఖ అయినా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. దీనికి కూడా లావణ్య తరఫు లాయర్ నుంచి సమాధానం లేదు.

ఆధారాలు సమర్పించేందుకు తమకు సమయం కావాలన్న లావణ్య తరఫు లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. రాజ్ తరుణ్ కు వెంటనే షరతులతో కూడా ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. 20వేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించి బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ కేసు నుంచి రాజ్ తరుణ్ కు తాత్కాలిక ఊరట లభించినట్టయింది.

రాజ్ తరణ్ తనతో ఏళ్ల పాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి, అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు సాక్ష్యాలన్నీ ఇచ్చానని ఆమె మీడియాకు చెప్పుకుంది. అయితే రాజ్ తరుణ్ తో పెళ్లి అయినట్టు ఒక్క సాక్ష్యం కూడా ఆమె చూపించలేకపోయింది. దీంతో హైకోర్టు రాజ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో రచ్చే రచ్చ…

మరోవైపు లావణ్య, రాజ్ తరుణ్ వివాదంపై సోషల్ మీడియాలో ప్రతిరోజూ రచ్చ నడుస్తూనే ఉంది. ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఏదో ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాషా ఆమెపై మరిన్ని ఆరోపణలు చేశాడు.

రాజ్ తరుణ్ ను లావణ్య చిత్రహింసలు పెట్టిందట. ప్రతి రోజూ డ్రగ్స్ తీసుకొని, రాజ్ తరుణ్ ను వేధించేదంట. తన కెరీర్ లో రాజ్ తరుణ్ ఎన్నో అవార్డులు సంపాదించుకున్నాడని, ఆ అవార్డులతోనే రాజ్ తరుణ్ ను రోజూ కొట్టేదని ఆరోపిస్తున్నాడు శేఖర్ భాషా.

రాజ్ కంటే ముందు మరో వ్యక్తితో లావణ్య రిలేషన్ షిప్ లో ఉందని.. ఓ సందర్భంలో అతడికి యాక్సిడెంట్ జరిగితే లావణ్య బిగ్గరగా నవ్విందని, ఆ టైమ్ లోనే ఆమె సైకో మెంటాలటీ గురించి అందరికీ తెలిసిందని ఆరోపిస్తున్నాడు శేఖర్. రాజ్ తరుణ్ ను కూడా ఇష్టమొచ్చినట్టు కొట్టి, ఇంకా చావలేదా అంటూ ప్రశ్నించేదని ఆరోపిస్తున్నాడు శేఖర్.

10 Replies to “ఇక రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేయలేరు”

  1. విజయవంతం గా రాజ్ ఇన్సిడెంట్ బాగా ఫేమస్ చేసి, శాంతం గా దారి మల్లించారు.. ఓం సాయి! ఓం శాంతి!

  2. టీడీపీ క్యాడర్/ఎమ్మెల్యే కోట్లు విలువేన cars కొనుగోలు చేస్తున్నారు.

    ఫారిన్ టూర్స్.

    ఇంకా అబ్బో చాల . చాల

    2 నెలల్లో ఎలా సాధ్యం.

    1) టీడీపీ వాళ్ళు ప్రతి నెల 2800 కోట్ల రూపాయ ఇసుకా దోపిడీ

    జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 2800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 2800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    2) కోట్ల విలువైన కాంట్రాక్ట్స్ లు టీడీపీ వాలుకి ఇచ్చారు ఇ 2 నెలల్లో.

Comments are closed.